అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం

7 May, 2020 00:47 IST|Sakshi

ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) షో ప్రోమో కోసం అమితాబ్‌ బచ్చన్‌ షూటింగ్‌లో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై అమితాబ్‌ స్పందించారు ‘‘అవును.. నేను షూటింగ్‌లో పాల్గొన్నాను. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. నిజానికి మేం రెండు రోజుల షూటింగ్‌ను ప్లాన్‌ చేశాం. కానీ ఒక్క రోజులోనే పూర్తి చేశాం.

లాక్‌డౌన్‌ తర్వాత షోను ఏ విధానంలో నిర్వహించాలనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎప్పటిలాగే మంచి వ్యూయర్‌షిప్‌తో సాగుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు’’ అని అమితాబ్‌ బచ్చన్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఒక్కరోజు జరిగిన ఈ షూటింగ్‌లో అమితాబ్‌ దాదాపు 12 వీడియోల్లో నటించారట. ఇందులో కేవలం కేబీసీ షోకు సంబంధించిన వీడియోలే కాకుండా కరోనా చికిత్స కోసం పోరాడుతున్న డాక్టర్లు, నర్సులను ప్రోత్సహించే వీడియోలు కూడా ఉన్నాయని సమాచారం.

మరిన్ని వార్తలు