దశాబ్దకాలంగా రిలీజ్‌కు నోచుకోని బిగ్‌బి సినిమా

31 Mar, 2018 10:29 IST|Sakshi
షూబైట్‌ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌

బాలీవుడ్‌లో యంగ్ హీరోలకు ధీటుగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. కలెక్షన్లు రికార్డ్‌ ల విషయంలోనూ బిగ్‌ బీ, యంగ్‌ హీరోలతో పోటీ పడుతున్నారు. ఇంత ఫాంలో ఉన్న అమితాబ్ నటించిన ఓ సినిమా దాదాపు పదేళ్లుగా రిలీజ్‌కు నోచుకుండా ఆగిపోయింది. విక్కీ డోనర్‌ ఫేం సుజిత్‌ సర్కార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘షూబైట్‌’ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు మనోజ్‌ నైట్‌ శ్యామలన్‌ స్క్రిప్ట్ అందించారు. అయితే తరువాత సినిమా హక్కుల విషయంలో వివాదం కావటంతో రిలీజ్ ఆగిపోయింది.

చాలా ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం నిర్మాణ సంస్థ సహకరించాలని ఇటీవల అమితాబ్ కోరారు. దీంతో మరోసారి దర్శకుడు సుజిత్‌ సినిమా విడుదల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అడ్డంకులు తొలగిపోతే ఎంత ఖర్చుట్టుకొని అయినా  సినిమాను విడుదల చేస్తానని, అందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో థగ్స్ హాఫ్ హిందూస్తాన్ సినిమాలో నటిస్తున్న అమితాబ్ తెలుగులో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారు.

>
మరిన్ని వార్తలు