'ధూమ్ 4'లో బిగ్ బి

16 Oct, 2015 11:49 IST|Sakshi
'ధూమ్ 4'లో బిగ్ బి

ధూమ్ సీరీస్లో మరో భాగం సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే మూడు భాగాలుగా మంచి విజయాలు సాధించిన ఈ సిరీస్లో ఇప్పుడు నాలుగో భాగం తెరకెక్కనుంది. తొలి మూడు భాగాలను నిర్మించిన యష్ రాజ్ ఫిలింస్ సంస్థ మరోసారి ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది.

ధూమ్ 2లో నెగెటివ్ పాత్రలో కనిపించిన హృతిక్ రోషన్ మరోసారి ధూమ్ 4లో నటిస్తుండగా, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు పోలీస్ పాత్రల్లో అలరించనున్నారు. దీనికితోడు ధూమ్ 4లో అమితాబ్ బచ్చన్ కూడా నటించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే అమితాబ్ పాత్ర నెగెటివా, పాజిటివా అన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.

మొదటి రెండు భాగాల తర్వాత లేటెస్ట్గా వచ్చిన ధూమ్ 3 టాక్ పరంగా కాస్త నిరాశపరిచినా.. కలెక్షన్ల పరంగా మాత్రం ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ధూమ్ 4తో మరోసారి తమ రికార్డ్లను తామే బద్దలు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి