మమ్మీ అమీ

24 Sep, 2019 00:38 IST|Sakshi
అమీ జాక్సన్‌

నటి అమీ జాక్సన్‌ తల్లయ్యారు. సోమవారం ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. ‘యాండ్రియాస్‌ (పాప పేరు).. మా ఏంజెల్‌. ఈ ప్రపంచానికి స్వాగతం’ అని క్యాప్షన్‌ చేస్తూ పాపతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. జార్జి పనయొట్టుతో అమీ జాక్సన్‌ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి నిశ్చితార్థం కూడా అయింది. ఇంకా పెళ్లి కాలేదు. విశేషం ఏంటంటే ఇటీవలే మాకు బాబు పుడుతున్నాడంటూ ‘జెండర్‌ రివీలింగ్‌ పార్టీ’ కూడా ఏర్పాటు చేశారు అమీ. అయితే పాపకు జన్మనిచ్చారు. ‘ఎవడు, ఐ, 2.0’ సినిమాల్లో  అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

మరిన్ని వార్తలు