డీఎన్‌ఏ టెస్ట్‌ ఓవర్‌!

30 Mar, 2018 01:22 IST|Sakshi
అమీ జాక్సన్‌

రిజల్ట్‌ కోసం వెయిటింగ్‌

మీ నాన్నగారి పేరు మీకు తెలుసు. మీ తాతగారి పేరు తెలుసు. మీ ముత్తాత పేరు అంటే కాస్త కష్టపడి తెలుసుకోవచ్చు. కానీ మీ ముత్తాత నాన్నగారి పేరేంటి? అని ఎవరైనా అడిగితే.. ఆలోచనలో పడతారు కదూ. ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవాలనే ఆలోచన కూడా కలుగుతుంది కదూ. హీరోయిన్‌ అమీ జాక్సన్‌కు అలాంటి ఆలోచనే కలిగింది.  తన ఫ్యామిలీ ట్రీ గురించి తెలుసుకోవాలనుకున్నా రామె. ఆల్రెడీ వై క్రోమోజోమ్‌ డీఎన్‌ఏ టెస్ట్‌ కూడా చేయించుకున్నారు.

నాన్న వైపు పూర్వీకులను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ టెస్ట్‌ను ప్రిఫర్‌ చేస్తారు. అమ్మవైపు పూర్వీకులను తెలుసుకోవాలనుకునేవారు మైటోకాండ్రియాల్‌ డీఎన్‌ఏ టెస్ట్‌ ప్రిఫర్‌ చేస్తారు. అమ్మానాన్న.. ఇద్దరి ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆటోసోమల్‌ డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించుకుంటారు. ఈ విషయంపై అమీ మాట్లాడుతూ– ‘‘నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావ్‌? అని కొత్తగా పరిచయమైన కొందరు నన్ను అడుగుతున్నారు. అప్పుడు నేను ఇంగ్లాండ్‌ అని చెప్పాను. ‘నువ్వు ఇంగ్లాండ్‌ అమ్మాయిలా లేవు. నీలో ఆ పోలికలు అంత స్పష్టంగా కనిపించడం లేదు’ అన్నారు.

మా నాన్నమ్మ  1990లో పోర్చ్‌గల్‌లో ఉండేవారు. కానీ అంతకు ముందు ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం నాకు ముఖ్యం. మా నాన్నగారి వైపు వాళ్ల గురించి తెలుసుకోవాలనుంది. కష్టమని తెలుసు. కానీ ప్రయత్నం మొదలుపెట్టాను’’ అన్నారు. డీఎన్‌ఏ టెస్ట్‌ ప్రాసెస్‌ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘టెస్ట్‌ చేయించుకోవడం ఈజీ. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అధికారులకు సంబంధిత వివరాలను చెప్పాలి. వీటితోపాటు మన లాలాజలాన్ని అందజేయాలి. దీనిని వాళ్లు మిలియన్ల మంది డీఎన్‌ఏలతో పోల్చి చూస్తారు. కొన్ని వారాల తర్వాత ఫలితాలను చెబుతారు’’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు