ఓ తండ్రి తపనే ఈ సినిమా

12 Dec, 2018 02:33 IST|Sakshi
కేఎల్‌ఎన్‌ రాజు, విరాజ్‌ జె.అశ్విన్, రిద్ధికుమార్, ప్రతాప్‌

కేఎల్‌ఎన్‌ రాజు

విరాజ్‌. జె. అశ్విన్‌ హీరోగా ప్రతాప్‌ తాతంశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ధికుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. కె. సతీష్‌ కుమార్‌ సమర్పణలో కేఎల్‌ఎన్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.  కేఎల్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ– ‘‘రాంగ్‌ ట్రాక్‌లో వెళ్తోన్న ఓ కూతుర్ని సరైన మార్గంలో పెట్టాలనే ఓ తండ్రి తాపత్రయమే ఈ చిత్రకథాంశం. ప్రతాప్‌ ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించారు. అంజన్‌ మంచి సంగీతం అందించారు.

అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. అశ్విన్, రిద్ధిలతో పాటు మిగతా ఆర్టిస్టులందరూ బాగా నటించారు. ఈ సినిమాపై నమ్మకంతో నిర్మాత అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఒక కొత్త హీరోపై ఎంతో ప్రెజర్‌ ఉంటుంది. ఈ ఒత్తిడిని మర్చిపోయేలా మా టీమ్‌ çసపోర్ట్‌ చేశారు. మార్తాండ్‌ కె. వెంకటేశ్‌గారు నేను హీరోగా నటించడానికి ప్రోత్సహించారు. రాజుగారు నిర్మాతగా ఉన్న ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది.

ఇందులో ఎనర్జిటిక్‌ అండ్‌ హైపర్‌గా ఉండే సూర్య క్యారెక్టర్‌ చేశాను’’ అన్నారు విరాజ్‌. ‘‘చిన్న సినిమా తీయడమే కాదు రిలీజ్‌ చేయడం కూడా కష్టమే. కానీ కేఎల్‌ఎన్‌ రాజుగారు మా సినిమాను ముందుండి నడిపించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ లాంటి పెద్ద సంస్థ రీలీజ్‌ చేస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు ప్రతాప్‌. ‘‘కొత్తవారిని ప్రోత్సహించడానికి కేఎల్‌ఎన్‌ రాజుగారు నిర్మాతగా మారారు. ఈ సినిమా ప్రయాణంలో భాగమైన అందరికీ థ్యాంక్స్‌’’అన్నారు సునైన. రిద్ధికుమార్, నటుడు కాశీవిశ్వనాథ్, సమర్పకుడు సతీష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు