జులాయి కథ!

7 Oct, 2017 02:29 IST|Sakshi

అశోక్‌ కుమార్, ప్రియావర్మ జంటగా కె.వి. సాయికృష్ణ దర్శకత్వంలో కె.చంద్రరావు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక ఊళ్ళో’. ఈ చిత్రం టీజర్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘టీజర్‌ అద్భుతంగా ఉంది. దర్శక–నిర్మాతలు చక్కగా తెరకెక్కిస్తున్నారు. రాజమౌళిగారి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన సాయికృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న  ఈ చిత్రం హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు.

‘‘రాజమౌళిగారి దగ్గర డైరెక్షన్‌లో మెళకువలు నేర్చుకున్నాను. కథ విన్న వెంటనే నిర్మాతలు సినిమా చేయడానికి ముందుకొచ్చారు. జులాయిగా తిరిగే ఓ కుర్రాడు ఎలా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు? అన్నదే చిత్రకథ. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు