అప్పుడే అయిపోయిందా అంటారు

23 Mar, 2018 04:45 IST|Sakshi
ఎత్తరి గురురాజ్‌

మలయాళ ‘ప్రేమమ్‌’ ఫేమ్‌ నివిన్‌ పౌలీ అతిథిగా, కొత్త నటీనటులు నటించిన చిత్రం ‘ఆనందం’. గణేష్‌ రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ  చిత్రాన్ని అదే పేరుతో నిర్మాత ఎత్తరి గురురాజ్‌ తెలుగులో ఈరోజు విడుదల చేస్తున్నారు. గురురాజ్‌ మాట్లాడుతూ– ‘‘కాలేజ్‌లో పికి ్నక్‌కి వెళ్లొచ్చే విద్యార్థుల కథే ఈ చిత్రం. నేటి యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. వేసవిలో ప్రేక్షకులకు నవ్వుల జల్లులు పంచే చిత్రమిది. సినిమా చూశాక అప్పుడే అయిపోయిందా! అంటారు. మలయాళంలో 4కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 20కోట్లు వసూలు చేసింది.

ఈ సినిమా రీమేక్‌ హక్కుల కోసం చాలామంది నిర్మాతలు సంప్రదించారు. అయితే.. యూనివర్శల్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు నేటివిటీకి సరిపోయేలా ఉండటంతో రీమేక్‌ చేయకుండా డబ్‌ చేశాం. ‘చిన్న సినిమాలను ప్రోత్సహించాలి’ అంటూ స్టార్‌ హీరోలు, డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలంతా మైకుల్లో ఉపన్యాసాలు ఇస్తుంటారే కానీ, ఆచరణలో పెట్టరు. చిన్న సినిమాలను ప్రోత్సహించినప్పుడే చాలామందికి పని దొరుకుతుంది. నటుడవ్వాలని హైదరాబాద్‌కొచ్చిన నేను బ్రహ్మానందంగారు, రాజేంద్రప్రసాద్‌గారు వంటి వారితోపాటు చాలా సినిమాల్లో నటించా. కానీ, బ్రేక్‌ రాకపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వెళ్లా. మళ్లీ నిర్మాతగా మారా. త్వరలోనే మా సుఖీభవ మూవీస్‌ బ్యానర్‌లో ఓ స్ట్రెయిట్‌ ఫిల్మ్‌ నిర్మించనున్నాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు