‘ఆనందం’ మూవీ రివ్యూ

23 Mar, 2018 09:36 IST|Sakshi

టైటిల్ : ఆనందం
జానర్ : యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : అరుణ్, థామస్ మాథ్యూ‌, రోషన్‌, విశాఖ్ నాయర్‌‌, అను ఆంటోని, సిద్ధి మహాజన్‌కట్టి
సంగీతం : సచిన్‌ వారియర్‌
దర్శకత్వం : గణేష్‌ రాజ్‌
నిర్మాత : ఎ.గురురాజ్‌

యూత్‌ ఫుల్‌ఎంటర్‌టైనర్‌లను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. యువతరానికి నచ్చే అంశాలకు కాస్త ఎంటర్‌టైన్మెంట్‌ ఉన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తుంటాయి. ఆ నమ్మకంతోనే 2016లో మలయాళంలో ఘన విజయం సాధించిన ఆనందం సినిమాను ఇప్పుడు అదే పేరుతో తెలుగులో డబ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రేమమ్‌ ఫేం నివీన్‌ పౌలీ అతిథి పాత్రలో నటించటంతో తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఏడుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? 

కథ :
కంప్యూటర్‌ సైన్స్ ఇంజీనిరింగ్‌ చదివే విద్యార్థులు కాలేజ్‌ తరుపున ఇండస్ట్రియల్‌ విజిట్‌కు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటారు. ఈ టూర్‌ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చాలా ప్లాన్స్‌ వేస్తారు. కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ సౌత్‌ ఇండియా వరకు మాత్రమే పర్మిషన్‌ ఇవ్వటంతో ముందు హంపీ వెళ్లి తరువాత గోవాలో న్యూ ఇయర్‌ పార్టీ సెలబ్రేట్‌ చేసుకోవాలని ప్లాన్‌ చేస్తారు. (సాక్షి రివ్యూస్‌) ప్రధానంగా ఏడుగురు విద్యార్థుల చుట్టూనే కథ నడుస్తుంది. విభిన్న వ్యక్తిత్వాలున్న ఆ విద్యార్థులకు ఈ టూర్‌ ఎలాంటి జ్ఞాపకాలను మిగిల్చింది..? వారిలో వ‍్యక్తిత్వాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
నటీనటులంతా కొత్తవారే.. ఎవరి పాత్రకు తగ్గట్టుగా వారు తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలుగులో ఇలాంటి కాలేజ్‌ కథలు చాలానే వచ్చాయి. హ్యాపీడేస్‌ లాంటి సినిమాలు దాదాపుగా ఇలాంటి కాన్పెప్ట్‌ తో తెరకెక్కినవే. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఈ కథలో పెద్దగా కొత్తదనమేమి కనిపించదు. బలమైన కథ లేకపోవటంతో దర్శకుడు.. స్టూడెంట్స్‌ చేసే అల్లరితోనే సినిమాను నడిపించాడు. (సాక్షి రివ్యూస్‌)బలమైన సన్నివేశాలు, ఆయడిన్స్‌ను కథలో ఇన్వాల్స్‌చేసే ట్విస్ట్‌లు ఒక్కటి కూడా సినిమాలో కనిపించవు. బలమైన ఎమోషన్స్‌ పండించే అవకాశం ఉన్న సన్నివేశాలను కూడా దర్శకుడు సింపుల్‌ గా తేల్చేయటం నిరాశకలిగిస్తుంది. సంగీతం కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదు. ఆనంద్‌ సీ చంద్రన్‌ సినిమాటోగ్రఫి బాగుంది. హంపీలోని లోకేషన్స్‌ను, గోవాలో పార్టీ వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫి
కొన్ని సరదా సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :
కథా కథనం

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Poll
Loading...
మరిన్ని వార్తలు