ఐసోలేషన్‌లో‌ ఎందుకున్నానంటే? : ఝాన్సీ

7 Jul, 2020 19:29 IST|Sakshi

హైదరాబాద్‌ : ఇటీవల కొందరు తెలుగు సీరియల్స్‌ నటులు కరోనా వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరికొందరికి కరోనా సోకిందనే తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో పలువురు వాటిపై వివరణ కూడా ఇచ్చారు. తాజాగా ప్రముఖ యాంకర్‌, నటి ఝాన్సీకి కరోనా సోకిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఆమె స్పందించారు. తనకు కరోనా సోకిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల  చేశారు.(చదవండి : ‘దాని కంటే ముందు నన్ను నేను నిరూపించుకోవాలి’)

తను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ఇటీవల చేసిన ఓ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకుని.. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానల్స్‌ తప్పుడు వార్తలు ప్రచురించాయని చెప్పారు. ఐసోలేషన్‌కు, క్వారంటైన్‌కు తేడా ఉందని చెప్పారు. కరోనా అందరికి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాంటప్పడు కరోనా సోకినవారిపై వివక్ష చూపడం సరికాదన్నారు. కరోనా వస్తే ఏం చేయాలి.. భయపడకుండా ముందకు ఎలా వెళ్లాలో ఆలోచించాలన్నారు. అనారోగ్య సమస్యలు, వయసు పైబడినవారి విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. (చదవండి : ఆ కూలీకి పోటెత్తిన‌ సుశాంత్ అభిమానుల కాల్స్)

తను వర్క్‌ చేసే సెట్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. అందుకే ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. ఇప్పటికే ఏడు రోజుల ఇంక్యూబేషన్‌ సమయం పూర్తయిందని.. మరో వారం రోజులు ఇంట్లోనే ఉంటానని చెప్పారు. రిస్క్‌ తీసుకోకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికైతే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వెల్లడించారు. ఒకవేళ తనకు పాజిటివ్‌ వస్తే.. జాగ్రత్తగా ఉంటానని, హెల్త్‌ ఎలా ఉందనేది  షేర్‌ చేస్తానని అన్నారు. వార్తలు రాసేముందు నిజాలు తెలుసుకోవాలని.. సరైన సమాచారం లేకుండా తప్పుడు వార్తలు రాయవద్దని కోరారు. కరోనాను జాగ్రత్తగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. 

clearing the doubts

A post shared by Jhansi (@anchor_jhansi) on

మరిన్ని వార్తలు