షూటింగ్‌లు స్టార్ట్‌.. యాంకర్స్‌ సందడి

18 Jun, 2020 21:24 IST|Sakshi

హైదరాబాద్‌ : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు మూడు నెలల తర్వాత టీవీ షూటింగ్‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్‌లకు అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం.. సెట్లలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అతి తక్కువ మంది సిబ్బందితో షూటింగ్‌లు జరుపుకోవాలని కూడా చెప్పింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. షూటింగ్‌లు ప్రారంభం కావడంతో యాంకర్లు తమ పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో చాలా రోజుల తర్వాత సెట్లలో సందడి వాతావరణం నెలకొంది. తమ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను పలువురు యాంకర్లు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. 

ప్రముఖ యాంకర్‌ సుమ..  ‘చాల రోజుల తర్వాత సెట్‌లోకి వచ్చాను. అన్ని జాగ్రత్తలు తీసుకుని.. బాధ్యతగా ఉండాలి’ అని పేర్కొన్నారు. అలాగే తను మేకప్‌ వేసుకుంటున్న ఓ చిన్నపాటి వీడియోను కూడా సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. మరోవైపు నటి, యాంకర్‌ అనసూయ కూడా జబర్దస్త్‌ సెట్‌లో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. వీ ఆర్‌ బ్యాక్‌ అని తెలిపారు. అలాగే యాంకర్‌లు రవి, భానుశ్రీలు కూడా షూటింగ్‌ సెట్‌లో చేసిన సందడిని ఇన్‌స్టాగ్రామ్‌లో​ పోస్ట్‌ చేశారు.

Never thought that satti and ramesh will have to dress up like this .

A post shared by Suma Kanakala (@kanakalasuma) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు