ఇక ఆ సన్నివేశాలు చెయ్యను

29 Aug, 2018 11:03 IST|Sakshi

తనకు నచ్చిన పనిచేయడానికి ఏమాత్రం వెనుకాడని నటి ఈమె.

తమిళసినిమా: సంచలన తారల్లో నటి అండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చిన పనిచేయడానికి ఏమాత్రం వెనుకాడని నటి ఈమె. ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో రోమాన్స్‌ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయినా, డోంట్‌కేర్, వ్యక్తిగత విషయాల గురించి ఇతరులకు బదులివ్వాల్సిన అవసరం లేదని బహిరంగంగానే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. నటిగానే కాకుండా మంచి గాయని కూడా అయిన ఆండ్రియా ఏ తరహా పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని నటించేది. అలా వేశ్య పాత్రలో నటించడానికీ వెనుకాడలేదు. ఇక ఇటీవల విడుదలైన విశ్వరూపం–2 చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాల్లోనూ నటించి శభాష్‌ అనిపించుకుంది.

ఇంతకుముందు గ్లామరస్‌ పాత్రల్లోనూ నటించిన ఆండ్రియా తరమణి లాంటి చిత్రాల్లో మంచి నటనను ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ధనుష్‌తో నటిస్తున్న వడ చెన్నై చిత్రంలోనూ చాలా వైవిధ్యభరతమైన పాత్రలో కనిపించనుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉంది. దీంతో  తన పంథాను మార్చుకుందట. చాలా సెలెక్టెడ్‌ చిత్రాలే చేస్తున్న ఈ భామ ఇకపై గ్లామర్‌ పాత్రల్లో నటించరాదన్న నిర్ణయం తీసుకుందట. నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలనే అంగీకరించనున్నట్లు పేర్కొంది. ఇకపై ఇమేజ్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించనున్నట్లు చెప్పింది. కాబట్టి దానికి భంగం కలిగించే లిప్‌లాక్, హీరోలతో సన్నిహితంగా నటించడం, హద్దులు మీరిన గ్లామర్‌ పాత్రల్లో నటించడం వంటి విషయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కథ వినే ముందే దర్శక నిర్మాతలకు చెప్పేస్తోందట. ఇప్పటి వరకూ అండ్రియా వేరు ఇకపై వేరు అని ఈ సంచలన నటి అంటోంది. చూద్దాం ఈ అమ్మడు తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందో. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో వడచెన్నై, కా అనే రెండు చిత్రాలే ఉన్నాయన్నది గమనార్హం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు