వేశ్య పాత్రలో ఆండ్రియా

18 May, 2016 19:05 IST|Sakshi
వేశ్య పాత్రలో ఆండ్రియా

 వేశ్య లాంటి పాత్రలో నటించడానికి హీరోయిన్లు ఒకప్పుడు సంకోచించేవారు. అలాంటిది ఇప్పుడు అగ్రనాయికలు సైతం సై అంటున్నారు. వేదం చిత్రంలో క్రేజీ నటి అనుష్క వేశ్య యువతిగా నటించి మెప్పించారు. అదే విధంగా శ్రీయ, చార్మీలాంటి వారు అలాంటి పాత్రలు ధరించడానికి వెనుకాడలేదు. తాజాగా నటి ఆండ్రియా వేశ్య పాత్రకు సిద్ధం అవుతున్నారు. బాలీవుడ్ నుంచి దక్షిణాదికి దిగుమతి అయిన ఈ భామ ఇక్కడ సంచలన నటిగా పేరొందారు. విశ్వరూపం చిత్రంలో విశ్వనటుడు కమలహాసన్‌కు జంటగా నటించిన ఆండ్రియా ప్రస్తుతం తరమణి చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు.
 
  తాజాగా ధనుష్ కథానాయకుడిగా నటించనున్న వడచెన్నై చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇందులో ధనుష్‌కు జంటగా సమంత ఇప్పటికే ఎంపికయ్యారు. వీరిద్దరు ఉత్తర చెన్నై వాసులుగా జీవించడానికి రెడీ అవుతున్నారు.కాగా ఇందులో ఆండ్రియా వేశ్య పాత్రను పోషించనున్నారని తెలిసింది. ఇది చాలా బలమైన పాత్ర అని, ఆండ్రియాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని చిత్ర యూనిట్ అంటోంది. వేట్రిమారన్ కథ, కథనం, దర్శకత్వం వహించనున్న ఈ వడచెన్నై చిత్రం జూన్ నెల 15న ప్రారంభం కానుంది. ప్రస్తుతం కొడి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ధనుష్ తదుపరి నటించే చిత్రం వడచెన్నైనే అవుతుంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి