అమ్రేశ్‌ సంగీతం ఆండ్రియా గీతం

16 Nov, 2017 07:30 IST|Sakshi
నటి ఆండ్రియాతో సంగీతదర్శకుడు అమ్రేశ్‌

తమిళసినిమా: యువ కెరటం అమ్రేశ్‌ తొలుత నటుడిగా రంగప్రవేశం చేసినా, ఇప్పుడు సంగీత దర్శకుడిగా దూసుకుపోతున్నారు. తాను హీరోగా నటించిన చిత్రంతోనే సంగీతదర్శకుడిగానూ పరిచయమైన ఈయన ప్రస్తుతం సంగీత దర్శకుడిగా చేతి నిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. డాన్సింగ్‌ స్టార్‌ ప్రభుదేవా నటిస్తున్న యంగ్‌ మంగ్‌ ఛంగ్, ఇటీవలే సెట్‌ పైకి వెళ్లిన చార్లిచాప్లిన్‌–2 చిత్రాలతో పాటు అరవిందస్వామి, అమలాపాల్‌ జంటగా నటిస్తున్న భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది సిద్ధిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన మలయాళంలో మమ్ముట్టి, నయనతార హీరోహీరోయిన్లుగా తెరకెక్కించిన సక్సెస్‌ఫుల్‌ చిత్రానికి రీమేక్‌ అన్నది గమనార్హం.

కాగా భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రంలో అమ్రేశ్‌ సంగీత బాణీలు కట్టిన ఒక పాటను సంచలన నటి ఆండ్రియా పాడడం విశేషం. నటి ఆండ్రియా చాలా అరుదుగానే పాడుతుంటారు. అదీ తన ఆ పాట హత్తుకుంటేనే పాడడానికి అంగీకరిస్తారు. అంటే అమ్రేశ్‌ కట్టిన బాణీలు నచ్చే తను భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ చిత్రంలో పాటను పాడారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్ర ఆడియోను ట్రిపుల్‌ రికార్డ్స్‌ సంస్థ సొంతం చేసుకుని ఈ నెల 30వ తేదీన చిత్ర గీతాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు