‘జేమ్స్..‌ మీరు లేకుండా ఏదీ మాములుగా ఉండదు’

30 Apr, 2020 19:27 IST|Sakshi

బాలీవుడ్‌ చాకొలెట్‌ బాయ్‌ రిషి కపూర్‌ మరణంపై ఆయన స్నేహితుడు, నటుడు అనిల్‌ కపూర్‌ సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో ఆవేదనతో కూడిన లేఖను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అనిల్‌ కపూర్‌, రిషి కపూర్‌ ఒకరినొకరు ప్రేమగా జేమ్స్‌, పాటన్‌ అని పిలుచుకుంటారు. అయితే వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు కలిసి విజయ్‌, గురుదేవ్‌, కరోబార్‌, ది బిజినెస్‌ ఆఫ్‌ లవ్‌ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే వీరి పిల్లలు రణ్‌బీర్‌,  సోనమ్‌ కపూర్‌ కూడా 2007లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘సావరియా’ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. (తండ్రి మరణంపై రిధిమా భావోద్వేగం)

చిన్ననాటి ఫోటోను షేర్‌ చేస్తూ..‘నా ప్రియమైన జేమ్స్‌కు.. నీ గురించి ఎలా మొదలు పెట్టాలో నాకు తెలియడం లేదు. కానీ చిన్నప్పటి నుంచి మన కలలను తెరపై చూసుకున్నప్పటి వరకు అన్నింటిలో మనం కలిసే ఉన్నాం. మీరు నాకు ఒక అన్నయ్యలాగా ఉన్నారు. నాకు సహాయం కావల్సినప్పుడు భుజం తట్టి నా వెంటే ఉన్నారు. ధైర్యం కోల్పోయినప్పుడు గురువులాగా ఉన్నారు. నాకు, నా కుటుంబానికి మీరు చూపిన అంతులేని ప్రేమకు కృతజ్ఞతలు. మీరు నా తల్లికి కొడుకులాగా ఉన్నారు. అలాగే కృష్ణ ఆంటీ కూడా నాకు ఎప్పుడూ అమ్మలాగే ఉంటుంది. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సినీ ప్రేమికులకు మీరు స్పూర్తిదాయకంగా నిలిచారు. ప్రతి రోజు మిమ్మల్ని తలుచుకుంటాను. మీరు లేకుండా ఏదీ మాములుగా ఉండదు. కానీ మీరు కోరుకున్నట్లు నేను మీ జీవితాన్ని జరుపుకుంటాను. మీ పాటన్‌’ అంటూ అంతిమ వీడ్కోలు పలికారు.( ముగిసిన రిషీ కపూర్‌ అంత్యక్రియలు )

అదే రిషి క‌పూర్ చివ‌రి కోరిక‌..

హిందీ తెరకు రొమాంటిక్ హీరో..

తండ్రి చివరిచూపుకు రిద్దిమాకు అనుమతి

మిమ్మ‍ల్ని చాలా మిస్‌ అవుతాను చింటూ సార్‌

నా ప్రేయసితో బ్రేకప్.. నీతూ సాయం కోరాను

బాలీవుడ్‌రిషిమరణం: పవన్‌ సంతాపం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు