కొడుక్కి క్లాస్ పీకిన టాప్ హీరో!

21 Apr, 2016 11:14 IST|Sakshi
కొడుక్కి క్లాస్ పీకిన టాప్ హీరో!

ముంబై: అనిల్ కపూర్ తనయుడు, వర్ధమాన హీరో హర్షవర్థన్ కపూర్ తన ప్రేయసి సప్నా పాబీకి బ్రేకప్ చెప్పాడు. వీరిద్దరూ అనిల్ కపూర్ కారణంగా విడిపోయినట్టు బాలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. '24' సినిమాలో అనిల్ కపూర్ కూతురిగా నటించిన సప్నాతో హర్షవర్థన్ ప్రేమలో పడ్డారు. యువజంట ప్రేమలోకాల్లో విహరించింది. విషయం అనిల్ కపూర్ కు తెలియడంతో కొడుక్కి క్లాస్ తీసుకున్నాడట. కెరీర్ ఆరంభంలో ప్రేమాదోమా అంటూ తిరిగితే మంచిది కాదని సలహాయిచ్చాడట. నీతో పాటు ఆమె కెరీర్ కూడా పాడవుతుందని నచ్చచెప్పాడు.

తండ్రి మాటలను తలకెక్కించుకున్న హర్షవర్థన్ ప్రియురాలికి బ్రేకప్ చెప్పాడు. తన తమ్ముడికి సోనమ్ కపూర్ కూడా బ్రెయిన్ వాష్ చేసిందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. 'మిర్జియా' సినిమాతో హర్షవర్థన్ హీరోగా బాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు 'రంగ్ దే బసంతి' ఫేమ్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది.