‘నా రక్తంలో సానుకూలత పరుగులు తీస్తోంది’

27 Aug, 2019 15:47 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ 2005లో నటించిన బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా ‘నో ఎంట్రీ’. ఈ సినిమా విడుదలై సోమవారం నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనిల్‌ కపూర్‌ ఆ చిత్రంలో పాపులర్‌ సరదా సన్నివేశాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ సన్నివేశంలో అనిల్‌, ఫర్దీన్‌ ఖాన్‌కు పాజిటివ్‌గా ఉండమని సలహా ఇస్తుంటాడు.‘నా రక్తంలో సానుకూలత ప్రవహిస్తోంది, ఎందుకంటే నో ఎంట్రీ సినిమాకు 14 ఏళ్లు’ అనే క్యాప్షన్‌తో అనిల్‌ కపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని పోస్ట్‌ చేశాడు. దర్శకుడు అనీస్‌ బాజ్‌మీ దర్శకత్వంలో ఈ చిత్రంలో అనిల్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌, ఫర్దీన్‌ ఖాన్‌లు హీరోలగా నటించగా.. బిపాస బసు, లారా దత్త, ఇషా డియోల్‌లు హీరోయిన్‌లుగా నటించారు.

అదే విధంగా ఈ సినిమా నిర్మాత బోని కపూర్‌ కూడా ‘2005లో అత్యంత ఘన విజయం సాధించిన ‘నో ఎంట్రీ’కి నేటితో 14 ఏళ్లు! తొందరల్లోనే మనందరం ‘నో ఎంట్రీ2’ తో మళ్లీ కలవబోతున్నందుకు సంతోషం’ అంటూ తన ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘నో ఎంట్రీ2’ డైరెక్టర్‌ అనీస్‌​ బాజ్‌మీకి, చిత్ర బృందానికి బోనీ ధన్యవాదాలు తెలిపాడు. ‘నో ఎంట్రీ’ని తెరకెక్కించిన దర్శకుడు అనీస్‌ బాజ్‌మీనే దాని సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నారు. సల్మాన్‌ ఖాన్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రజల్లో మార్పుతోనే కరోనా దూరం: రష్మి గౌతమ్‌

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా