నేను భయపడే ఏకైక వ్యక్తి నువ్వు: అనిల్‌ కపూర్‌

9 Jun, 2020 13:59 IST|Sakshi

‘నీకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. నేను భయపడే ఏకైక వ్యక్తి నువ్వు’ అని బాలీవుడ్‌‌ నటుడు అనిల్‌ కపూర్‌ తన కూతురు సోనమ్‌ కపూర్‌ను ఉద్ధేశించి పేర్కొన్నారు. మంగళవారం సోనమ్‌ కపూర్‌ 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అనిల్‌ కపూర్‌ తన పెద్ద కుమార్తెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కూతురుతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. కాగా సోనమ్‌ ఈసారి తన బర్త్‌డేను తండ్రి అనిల్‌ కపూర్‌తో కలిసి జరుపుకోవడం విశేషం. లాక్‌డౌన్‌ కాలంలో భర్త ఆనంద్ అహుజాతో కలిసి న్యూఢిల్లీలో ఉన్న సోనమ్‌.. సోమవారం ముంబైకు చేరుకున్నారు. (‘తను నవ్వింది.. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’)

‘ఒక కూతురిగా నీకంటే ఎవరూ బాగా ఉండలేరు. ఆనంద్‌ అహుజాకు సరైన భాగస్వామి. సినిమా తెరపై ఒక స్టార్‌. నువ్వు నా నమ్మకం, ఆనందం, నీకు తండ్రిగా ఉండటం గర్వకారణం. నా అందమైన సోల్‌. అలాగే నన్ను భయపెట్టే ఏకైక వ్యక్తి. ఇప్పుడు మాస్టర్‌ చెఫ్‌ కూడా అయ్యావు. పుట్టినరోజు శుభాకాంక్షలు సోనమ్‌‌. ఈ రోజు నువ్వు మా అందరితో ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తునే ఉంటా.’ అంటూ అనిల్‌ కపూర్‌ తన కూతురు సోనమ్‌పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. (విజయవాడ చేరుకున్న చిరు, నాగార్జున )

To a daughter like no other, the perfect partner to @anandahuja, a star on screen and an icon with an unimitable style. She's my confidant, my joy, my pride, the most generous hearted soul I know, (the only person I am shit scared of) & now a bona fide master chef! Happy Birthday, @sonamkapoor! I’m so happy that you’re here with all of us today! ‬ ‪Love You, Always!

A post shared by anilskapoor (@anilskapoor) on

కాగా అనిల్‌ కపూర్‌ పోస్ట్‌పై కూతురు సోనమ్‌ స్పందించారు. తండ్రికి ‘లవ్ ‌యూ డాడీ’ అని కామెంట్‌ చేశారు. అలాగే అతని అల్లుడు ఆనంద్ అహుజా స్పందిస్తూ.. ‘సోనమ్‌ కేవలం మిమ్మల్ని మాట్రమే భయపెట్టడం లేదు. నన్ను కూడా భయపెడుతుంది’ అని సరదాగా కామెంట్‌ చేశాడు. 

The best best husband in the world , who gives me everything that I truly need. He is my blessing on my birthday. Love you @anandahuja from the first day I hugged you.

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు