ఇప్పట్లో ఆ ఆలోచనే లేదు!

15 Mar, 2017 03:26 IST|Sakshi
ఇప్పట్లో ఆ ఆలోచనే లేదు!

చిన్న గ్యాప్‌ తరువాత నటి అంజలి మరోసారి వార్తల్లోకెక్కారు. తమిళం, తెలుగు భాషల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నటి ఈ అచ్చ తెలుగు అమ్మాయి. ఆ మధ్య పిన్నితో మనస్పర్థలు, దర్శకుడు కళంజంతో వివాదాలు అంటూ కోలీవుడ్‌లో కలకలం సృష్టించిన అంజలి కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నారు. అలాంటిది తాజాగా ఈ అమ్మడి పేరు మీడియాలో చర్చనీయంశంగా మారింది. నటుడు జయ్‌తో ప్రేమ కలాపాలు అంటూ చాలా కాలంగానే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల జయ్‌ స్వయంగా దోసెలు వేసి అంజలికి పెట్టడం, వాటిని ఆమె కమ్మగా ఆరగించడం వం టి దృశ్యాలు మీడియాలో హల్‌చల్‌ చేశాయి. దీంతో మరోసారి ఈ సినీ జంట ప్రేమ వ్యవహారం హాట్‌హాట్‌గా మారింది. చిన్న గ్యాప్‌ తరువాత అంజిలి తమిళంలో నటిస్తున్న చిత్రం బెలూన్‌. ఇందులో జయ్‌ కథా నాయకుడు. ఈ చిత్రంలో నటి అంజలికి సంబందించిన సన్నివేశాలు పూర్తి కావడంతో తను చిత్ర యూనిట్‌కు గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఐ లవ్‌ యూ అంజలి అంటూ జయ్, సంతోషకరమైన సమయం మళ్లీ వస్తుంది అని అంజలి ఒకరికొకరు ట్వీట్‌ చేసుకోవడం వారి మధ్య ప్రేమకు అద్దం పడుతుందని చెప్పవచ్చు.

 ఇలాంటి పరిస్థితుల్లో నటి అం జలికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని అంజలి ఖండించా రు. తనకిప్పుడే పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇం కా తను చెబుతూ ఒకే సారి పలు చిత్రాల్లో నటిం చాలనే ఆశ తనకు లేదని, నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించాలని కోరుకుంటున్నానని అన్నారు.

 చిత్రంలో తన పాత్ర గురించి అందరూ చెప్పుకోవా లన్నారు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలు ఉన్నాయని, అందువల్ల తన దృష్టి అంతా నటనపైనే సారిస్తున్నట్లు తెలిపారు.పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పట్లో లేదని, అలాంటిదేదైనా ఉంటే కచ్చితంగా అందరికీ చెబుతా నని అన్నారు. ప్రస్తుతం తన సోదరుడికి వధువును వెతికే పనిలో ఉన్నట్లు అంజలి చెప్పారు .

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా