‘ఒ’ అంటున్న అంజలి

18 Jun, 2018 08:08 IST|Sakshi
అంజలి

తమిళసినిమా: నటి అంజలి కొత్తగా ‘ఒ’ అంటోంది. కట్రదు తమిళ్‌ అంటూ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చినా, అంగాడితెరు చిత్రంతో అందరి మనసుల్ని దోచుకున్న తెలుగు అమ్మాయి అంజలి. ఆ తరువాత ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ తదితర చిత్రాలతో విజయాలను అందుకున్న ఈ అమ్మడికి పినతల్లితో గొడవ ఒక రకంగా మంచే చేసిందనవచ్చు. ఆ కారణంగానే తెలుగులోనూ అవకాశాలు సంపాదించుకుంది. అలా అప్‌ అండ్‌ డౌన్‌గా సాగుతున్న అంజలి సినీ కేరీర్‌ తాజాగా మళ్లీ వేగం పుంజుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో నాలుగైదు చిత్రాలతో బీజీగా ఉంది. విజయ్‌ఆంటోనితో నటించిన కాశి చిత్రం ఇటీవలే విడుదలైంది. మమ్ముట్టికి జంటగా నటించిన పేరంబు చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం కాన్‌బదు పోల్, నాడోడిగళ్‌–2, లిసా, విజయ్‌సేతుపతికి జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది.

తాజాగా మరో చిత్రంలో నటించే అవకాశం అంజలిని వరించింది. దీని పేరు ‘ఒ’. ఇలాఉండగా ఈ బ్యూటీకి శనివారం పుట్టిన రోజు. అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. పనిలో పనిగా తన నూతన చిత్రం ‘ఒ’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది హర్రర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం. ఏజే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్‌ బిగ్గాడ్‌ దర్శకత్వం వహించనున్నారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఆంగ్ల పదాల్లో ‘ఒ’ అక్షరానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాంటి అలాంటి ఒక ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కించినున్న ఈ చిత్రానికి ‘ఒ’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిపారు. నటి అంజలి తన కేరీర్‌లో ఇలాంటి కథా చిత్రాన్ని ఇప్పటి వరకూ చేయలేదని, హర్రర్‌ థ్రిల్లర్‌తో వైవిధ్యంగా ‘ఒ’ చిత్రం ఉంటుందని పేర్కొంది. త్వరలో సెట్‌ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ చిత్ర టైటిల్‌ను దర్శకుడు వెంకట్‌ ప్రభు శనివారం ఆవిష్కరించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా