రూట్‌ మార్చిన అంజలి

1 Jun, 2019 10:16 IST|Sakshi

నటి అంజలి రూట్‌ మార్చారు. నటిగా కోలీవుడ్, టాలీవుడ్‌ అంటూ చక్కర్లు కొడుతున్న ఈ అమ్మడికి ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. అయితే కోలీవుడ్‌లో మాత్రం బిజీగానే ఉన్నా.. సక్సెస్‌లు మాత్రమే తగ్గాయి. తాజాగా నటించిన లిసా చిత్రంపై ఈ సంచలన నటి చాలా ఆశలు పెట్టుకున్నారు. పైగా 3డీ ఫార్మెట్‌లో తెరకెక్కడంతో హర్రర్‌ కథా చిత్రం లిసా అందరినీ భయపెట్టి వసూళ్లు రాబడుతుందని ఆశించారు.

అయితే ఇటీవల తెరపైకి వచ్చిన లిసా చిత్రం అంజలి ఆశలపై నీళ్లు చల్లింది. అదే విధంగా ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో ఈ అమ్మడు హర్రర్‌ చిత్రాలనే చేస్తూ వచ్చారు. లిసా చిత్ర రిజల్ట్‌తో అంజలి రూట్‌ మార్చినట్లు తెలుస్తోంది. హర్రర్‌ కథా చిత్రాలు వర్కౌట్‌ కాకపోవడంతో ఈ బ్యూటీ ఇప్పుడు కామెడీకి మారిపోయారు. దర్శకుడు కృష్ణన్‌ జయరాజ్‌ తాజాగా ఒక వినోదభరిత కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈయన ఇంతకు ముందు మిర్చి శివ, వసుంధర జంటగా సొన్నా పురియాదు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. తన తాజా చిత్రంలో హీరోయిన్‌గా నటి అంజలిని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం అంజలి విజయ్‌సేతుపతికి జంటగా నటించిన సింధుబాధ్, శశికుమార్‌ సరసన నటించిన నాడోడిగళ్‌–2 చిత్రాలు షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. 

ఈ చిత్రాలు సాధించే విజయాల కోసం అంజలి ఆశగా ఎదురుచూస్తోందట. నటుడు జైతో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో కొంతకాలం ఒంటరిగానే ఉన్న అంజలి తాజాగా మరో నటుడితో లవ్‌లో పడ్డట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది అంజలి స్పందిస్తేగానీ తెలియదు. అన్నట్లు ఇటీవల ఈ బ్యూటీ కాస్త బరువు తగ్గి మరింత అందంగా తయారయ్యారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం