సంతోషంగా ఇంటికి వెళ్తారు

18 Feb, 2019 03:54 IST|Sakshi

‘‘తమిళంలో ‘ఇమ్మైక్కా నొడిగల్‌’ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెండేళ్లు పట్టింది. సినిమా సక్సెస్‌ అయ్యాక ఆ కష్టాన్ని మర్చిపోయాం. తెలుగులోనూ అదే రేంజ్‌ సక్సెస్‌ అవ్వాలని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు. నయనతార లీడ్‌ రోల్‌లో రాశీఖన్నా, విజయ్‌సేతుపతి ముఖ్య పాత్రల్లో దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఇమ్మైక్కా నొడిగల్‌’. ‘అంజలి సీబీఐ’ టైటిల్‌తో సి.హెచ్‌. రాంబాబు, ఆచంట గోపీనాథ్‌ ఈ నెల 22న తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఈ చిత్ర ఆడియో లాంచ్‌ జరిగింది. మిలింద్‌ రావ్‌ సీడీ విడుదల చేసి తుమ్మల ప్రసన్నకుమార్‌కు అందించారు. ‘‘ఇమ్మైకా నొడిగల్‌’ చూడగానే నచ్చి, ఫ్యాన్సీ రేట్‌తో హక్కులను తీసుకున్నాం’’ అన్నారు సిహెచ్‌ రాంబాబు. ‘‘రజనీకాంత్‌ కెరీర్‌లో ‘బాషా’ చిత్రంలా నయనతారకు ‘అంజలి సీబీఐ’ అలా నిలిచిపోతుంది. ప్రతి సీన్‌ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. టికెట్‌ కొని సినిమాకు వచ్చే ప్రేక్షకుడి డబ్బులు వృథా కావు. సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇకపై వరుసగా సినిమాలు చేస్తాం’’ అన్నారు ఆచంట గోపీనాథ్‌. అమ్మిరాజు, శ్రీరామకృష్ణ పాల్గొన్నారు.
∙అమ్మిరాజు, గోపీనాథ్, ప్రసన్న కుమార్, అజయ్‌ జ్ఞానముత్తు

మరిన్ని వార్తలు