'హేయ్.. స్టాట్ ట్వీట్' అంటున్న హీరోయిన్

31 Jan, 2015 11:17 IST|Sakshi

హైదరాబాద్: సినిమాలే కాదు... తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు నటీనటులు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ ట్విట్టర్లో చేరింది. ఇప్పటికే పలువురు నటీ నటులు అభిమానులకు మరింత చేరువ అయ్యేందుకు ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల ద్వారా కనెక్ట్ అవుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ లిస్ట్లోకి తెలుగమ్మాయి అంజలి కూడా వచ్చేసింది. నిన్న మొన్నటి వరకూ ఫేస్బుక్లో సందేశాలు పంపుతున్న ఈ భామ శుక్రవారం ట్విట్టర్ ఖాతాను ప్రారంభించింది.  హేయ్.. స్టాట్ ట్వీట్.. అంటూ ఫ్యాన్స్కు సందేశం పంపింది. తనపై వచ్చే వివాదాలపై ఇక నుంచి ట్విట్టర్, ఫేస్బుక్ నుంచే క్లియర్ మెసేజ్ ఇచ్చేందుకు అంజలి సిద్ధమైందట. ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.