పల్లెటూరి ప్రేమకథ

17 Oct, 2019 05:58 IST|Sakshi
సుధ, రవితేజ, అన్నపూర్ణ, జమున

సీనియర్‌ నటి అన్నపూర్ణ, మాస్టర్‌ రవితేజ ప్రధాన పాత్రల్లో శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. ఎమ్‌ఎన్నార్‌ చౌదరి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శివనాగు మాట్లాడుతూ– ‘‘అనుబంధాలు, ఆత్మీయతలు, పల్లెటూరి ప్రేమలు ఆవిష్కరించే చిత్రమిది. ముద్దపప్పు, ఆవకాయ భోజనం ఎంత రుచికరంగా ఉంటుందో మా సినిమా కూడా అంతలా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. అమరావతి సమీపంలోని వైకుంఠపురం అనే పల్లెటూరిలో మా సినిమా చిత్రీకరణ జరిపాం. అక్కి నేని అన్నపూర్ణమ్మగా అన్నపూర్ణ, అక్కినేని అనసూయమ్మ పాత్రలో జమునగార్లు నటించారు’’ అన్నారు. ‘‘ప్రస్తుతం డీటీయస్‌ పనులు జరుగుతు న్నాయి. నవంబర్‌లో సినిమాను రిలీజ్‌ చేయాలను కుంటున్నాం’’ అన్నారు ఎమ్‌ఎన్నార్‌ చౌదరి.

మరిన్ని వార్తలు