ఆ ఇద్దరూ 'బెంగళూరు డేస్' కెళ్లారు..

13 Dec, 2014 18:21 IST|Sakshi
ఆ ఇద్దరూ 'బెంగళూరు డేస్' కెళ్లారు..

తెలుగులో మరో మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కబోతుంది. అప్పట్లో తాతలు కలిసి నటిస్తే ఇప్పుడు.. మనవళ్లు కలిసి నటించబోతున్నారు.    తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, లవర్ బాయ్ నాగ చైతన్య కలిసి నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతుంది. 'బొమ్మరిల్లు'ను ఇంటి పేరుగా మార్చుకున్న భాస్కర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మలయాళ చిత్రం 'బెంగళూరు డేస్' రీమేక్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా హీరోయిన్స్ ఎవరనేది ఖరారు కాలేదు.

కాగా 'బెంగళూరు డేస్' హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అయితే ఆయన ఇప్పటికే  పలు చిత్రాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా హక్కులను మరో నిర్మాణ సంస్థకు అప్పగించినా.. దిల్ రాజు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది.  

గతంలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా రుపొందబోతున్నదని  ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. దాంతో 'నాగ్'తో మిస్ అయిన ఛాన్స్...ఇప్పుడు కొడుకుతో భర్తీ అయినట్లు అయింది. కాగా గత ఏడాది కాలంగా నాగార్జున, బాలకృష్ణల మధ్య మాటలు లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అబ్బాయిలు ఇద్దరూ కలిసి నటించటం విశేషం.