‘ఆరేళ్లు పెద్దవాడు...అస్సలు చర్చించను’

5 Aug, 2019 11:01 IST|Sakshi

తనకు తల్లైనా, తండ్రైనా అన్నీ అన్నయ్యేనని బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ సోదరి అన్షులా కపూర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఆపన్నులకు హస్తం అందించేందుకు అన్షులా ఇటీవలే ‘ఫ్యాన్‌కైండ్‌’ అనే ఆన్‌లైన్‌ ఫండ్‌రైజింగ్‌ వెంచర్‌ను ప్రారంభించారు. చారిటీ కార్యక్రమాల గురించి చర్చించుకునేందుకు సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య ‘ఫ్యాన్‌కైండ్‌’ వారధిగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ మీడియా సమావేశానికి హాజరైన ఆమెకు తన అన్న అర్జున్‌ కపూర్‌ గురించి వివిధ ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చిన అన్షులా.. అర్జున్‌ రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి అడగగానే ఒకింత అసహానికి గురయ్యారు. మలైకాతో అర్జున్‌ను ముడిపెట్టి మాట్లాడటం తనకు ఇబ్బంది కలిగిస్తుందని పేర్కొన్నారు. వారిద్దరి గురించి వస్తున్న వదంతుల గురించి తానేమీ మాట్లాడదలచుకోవడం లేదని చెప్పారు. తన కంటే ఆరేళ్లు పెద్దవాడు, తండ్రిలా చూసుకునే అన్నతో ఇటువంటి విషయాలు చర్చించనని చెప్పుకొచ్చారు.

కాగా అర్జున్‌ కపూర్,  అన్షులా‌.. నిర్మాత బోనీ కపూర్‌ మొదటి భార్య మోనా పిల్లలు అన్న సంగతి తెలిసిందే. శ్రీదేవితో ప్రేమలో పడిన తర్వాత మోనాకు విడాకులిచ్చిన బోనీ.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అర్జున్‌, అతడి చెల్లి అన్షులా తండ్రికి దూరంగానే ఉన్నారు. అయితే శ్రీదేవి మరణానంతరం తండ్రి, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలతో కలిసి పోయిన అర్జున్‌.. ప్రతీ విషయంలోనూ వారికి అండగా నిలుస్తున్నాడు. ఇక అర్జున్‌ కపూర్‌- మలైకా అరోరా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వీడియో వైరల్‌..  రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు

పోసానితో నాకెలాంటి విభేదాలు లేవు...

వారం రోజులపాటు ఆశ్రమంలో

ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు

సౌత్‌ ఎంట్రీ?

దోస్త్‌ మేరా దోస్త్‌

చూసీ చూడంగానే...

బందోబస్త్‌కు సిద్ధం

అదే ఈ సినిమా మొదటి విజయం

రీమేక్‌ చేయడం సులభం కాదు

ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌

ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!

పైసా వసూల్‌ మూవీగా సూపర్‌ 30

24 ఏళ్లకే మాతృత్వాన్ని అనుభవించా..

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

పూరీతో రౌడీ!

రాజ్ కందుకూరి త‌న‌యుడు హీరోగా ‘చూసీ చూడంగానే’

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

గోవా కాసినోలో టాలీవుడ్ స్టార్‌

విధి అనుకూలిస్తేనే : రాజమౌళి

హీరో బుగ్గలు పిండేశారు!

మరో వివాదంలో ‘ఇస్మార్ట్ శంకర్‌’

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

కోడలి క్వశ్చన్స్‌..మెగాస్టార్‌ ఆన్సర్స్‌

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆరేళ్లు పెద్దవాడు...అస్సలు చర్చించను’

వీడియో వైరల్‌..  రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు

వారం రోజులపాటు ఆశ్రమంలో

ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు

సౌత్‌ ఎంట్రీ?

దోస్త్‌ మేరా దోస్త్‌