అంతరిక్షంలో ఏం జరిగింది?

18 Oct, 2018 00:27 IST|Sakshi
వరుణ్‌ తేజ్‌

‘ఫిదా, తొలిప్రేమ’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత వరుణ్‌ తేజ్‌ నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్‌’. లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ కథానాయికలు. తొలి చిత్రం ‘ఘాజీ’తో జాతీయ అవార్డు అందుకున్న సంకల్ప్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని దసరా సందర్భంగా విడుదల చేశారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ వ్యోమగామిగా కనిపించనున్నారు. ఈ టీజర్‌లోని సన్నివేశాలు సినిమాపై ఉత్కంఠ పెంచేస్తున్నాయి. అంతరిక్షంలో ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 21న విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా