ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ

31 Aug, 2018 01:30 IST|Sakshi
వరుణ్‌ తేజ్‌

అంతరిక్షంలోకి వెళ్లడానికి సుదీర్ఘమైన చర్చలు జరుపుతున్నారు వరుణ్‌ తేజ్‌ అండ్‌ టీమ్‌. మరి ఆ ఆఫీస్‌ మీటింగ్స్‌ ఎందుకో తెలియాలంటే కొన్ని రోజులు నిరీక్షించాల్సిందే. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కిమీ’. స్పేస్‌లో జరిగే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదితీరావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై దర్శ కుడు క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ ప్రముఖ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన ఆఫీస్‌ సెట్లో షూటింగ్‌ జరుపుతోంది చిత్రబృందం. వరుణ్‌ తేజ్, అవసరాల శ్రీనివాస్‌ మరికొందరు నటీనటులు పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఆఫీస్‌కు సంబంధించిన సెట్లోనే షూటింగ్‌ జరపనున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ ఇంకొక్క షెడ్యూల్‌ మాత్రమే మిగిలి ఉందట. డిసెంబర్‌ 21న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి, కెమెరా: జ్ఞానశేఖర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా