మెగా హీరో లేటెస్ట్‌ మూవీ టైటిల్‌ ఫిక్స్‌

15 Aug, 2018 10:22 IST|Sakshi

తన అంతరిక్ష ప్రయాణాన్ని వెండితెరపై చూపించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు మెగా హీరో వరుణ్‌ తేజ్‌. ఫిదా, తొలిప‍్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న వరుణ్‌ తేజ్‌ హీరోగా అంతరిక్షం నేపథ్యంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు​. మూవీ టైటిల్‌ను ‘అంతరిక్షం’ అని రివీల్‌ చేశారు. వరుణ్‌ తేజ్‌ అంతరిక్షంలో ఉన్న ఓ ఫొటోను ఫస్ట్‌ లుక్‌గా రిలీజ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఈ పోస్టు వైరల్‌గా మారింది.

ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అంతరిక్షం’ మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ మూవీలో అదితి రావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్‌. జ్ఞానశేఖర్‌ ఛాయా గ్రాహకుడు. ఈ డిసెంబర్‌ 21న సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.

 

మరిన్ని వార్తలు