ఓ ఇంటిదాన్నయ్యా!

30 Oct, 2017 00:43 IST|Sakshi

‘మలయాళంలో ‘యాక్షన్‌ హీరో బిజు’ సినిమా చేశా. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయా. ఆ చిత్రం చూసిన జ్యోతికృష్ణగారు నన్ను కాంటాక్ట్‌ చేసి, ‘ఆక్సిజన్‌’లో అవకాశం ఇచ్చారు. తెలుగులో నా తొలి సినిమా అదే. ‘ఆక్సిజన్‌’లో నటిస్తున్నప్పుడే ‘మజ్ను’ సినిమాలో అవకాశం వచ్చింది’’ అని కథానాయిక అనూ ఇమ్మాన్యుయేల్‌ అన్నారు.

గోపీచంద్, అనూ ఇమ్మాన్యుయేల్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. ఐశ్వర్య నిర్మించిన ‘ఆక్సిజన్‌’ నవంబర్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అను చెప్పిన చిత్ర విశేషాలు...


► ఇదొక హెవీ యాక్షన్‌ మూవీ. మంచి సోషల్‌ మెసేజ్‌ కూడా ఉంది. ఇందులో నా పాత్ర పేరు గీత. డాక్టర్‌గా కనిపిస్తాను. తెలుగు రాదు కాబట్టి భయపడ్డాను. అయితే జ్యోతికృష్ణగారి హెల్ప్‌ చేశారు. చాలా ఈజీ అయింది. ఇప్పుడు తెలుగు ఓకే. గోపీచంద్‌గారితో నటించడం చాలా ఆనందంగా ఉంది. ‘ఆక్సిజన్‌’  మంచి సినిమా. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. తెలుగులో ఎక్కువ సినిమాలు, మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. ఇక్కడ వాతావరణం కూడా బావుంది. కాబట్టి, నా ప్రాధాన్యత తెలుగు సినిమాలకే. తమిళంలో ఓ సినిమా చేశా. మలయాళంలోనూ చేయాలనుకుంటున్నా.

► ఒక నటిగా అన్ని రకాల పాత్రలూ చేయాలనుంది. గ్లామర్‌ రోల్స్‌ చేయడానికీ సిద్ధమే. నా దృష్టిలో గ్లామర్‌ రోల్స్, వల్గర్‌ రోల్స్‌కి చాలా తేడా ఉంది. గ్లామర్‌ ఓకే కానీ, వల్గర్‌గా ఉండకూడదని అనుకుంటాను.

► నేను హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యా. ఇక్కడ ఫ్లాట్‌ కూడా కొనుక్కున్నా. తెలుగు ఇండస్ట్రీలో అందరితో స్నేహంగానే ఉంటా. కానీ, నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ ఎవరూ లేరిక్కడ.

► ప్రస్తుతం నా కెరీర్‌ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. పవన్‌ కల్యాణ్‌గారితో నటించడం గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఓ సినిమా, మారుతిగారి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న చిత్రంలోనూ నటిస్తున్నా. తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకోవాలనుకుంటున్నా.

మరిన్ని వార్తలు