వాళ్లు వ్యభిచారం బిజినెస్‌లోకి దిగారు: దర్శకుడు

9 Mar, 2020 19:53 IST|Sakshi

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థప్పడ్‌’ (చెంపదెబ్బ అని అర్థం). ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం తొలివారం రూ.23 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లపై ఓ వెబ్‌సైట్‌ కాస్త వ్యంగ్యంగా ‘థప్పడ్‌కు ప్రేక్షకులు చెంప పగిలేలా సమాధానమిచ్చారు’ అని శీర్షిక పెట్టింది. సాధారణంగా సినిమాల మీద వచ్చే ఇలాంటి విమర్శలను దర్శకులు పెద్దగా పట్టించుకోరు. కానీ ‘థప్పడ్‌’ దర్శకుడు అనుభవ్‌ సిన్హాకు మాత్రం ఆ టైటిల్‌ చూడగానే చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముందీ.. వార్త రాసిన వాళ్లను ఎడాపెడా తిట్టేశాడు. చెప్పడానికి కూడా వీల్లేని బూతులు అనేశాడు. ‘వీళ్లు సినిమా వ్యాపారం నుంచి వ్యభిచారం బిజినెస్‌లోకి మారిపోయారు. నా  డబ్బులు.. నా సినిమా.. నా లాభం. మధ్యలో మీకేంటి..? నేనేమైనా మీకు షేర్లు అమ్మానా? పోనీ మీరేమైనా షేర్లు నాకు అమ్మారా? ముందు వెళ్లి సినిమా చూడండి. వీలైతే ఇష్టపడండి, లేకపోతే ద్వేషించండి. అది మీ ఇష్టం’ అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నాడు. (ఆ విషయం గురించి దయచేసి అడగకండి: తాప్సీ)

‘సినిమా విడుదలైన రెండు మూడు రోజుల తర్వాతే అసలైన కలెక్షన్ల వివరాలు తెలుస్తాయి. దీని కన్నా ముందే వెల్లడించే కలెక్షన్లు కేవలం ఊహాగానాలు, ఇంకా ఇష్టమొచ్చినట్లుగా రాసుకొన్నవి మాత్రమే’నని పేర్కొన్నాడు. అయితే సిన్హ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. మీ తిట్లలో మహిళలను కించపరుస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని మొట్టికాయలు వేశారు. దీంతో అతను తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. థప్పడ్‌ చిత్రాన్ని కించపరచడంతో కోపం పట్టలేకపోయానని.. ఈ క్రమంలో తప్పుగా మాట్లాడినందుకు క్షమించాలని అనుభవ్‌ పేర్కొన్నాడు. (తాప్సీ ‘థప్పడ్‌’ మూవీ రివ్యూ)
 

మరిన్ని వార్తలు