‘తనే నా హీరో’

13 Aug, 2018 13:25 IST|Sakshi
అనుపమ్‌ ఖేర్‌ (ఫైల్‌ ఫోటో)

సోనాలీ బింద్రే ప్రస్తుతం క్యాన్సర్‌ చికిత్స కోసం న్యూయార్క్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కూడా ఒక షో షూటంగ్‌ నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన సోనాలీని కలిశారు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘నేను సోనాలీతో కలిసి కొన్ని చిత్రాల్లో నటించాను. బయట కూడా చాలాసార్లు తనని కలిశాను. తనేప్పుడు నవ్వుతూ.. ప్రశాంతంగా ఉండేది. కానీ నేను ఇన్ని రోజుల చూసిన సోనాలీకి.. ఓ 15 రోజులుగా చూస్తోన్న సోనాలీకి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను ‘తనే నా హీరో’ అని’ అంటూ ట్వీట్‌ చేశారు.

ట్వీట్‌తో పాటు చికిత్సకు ముందు సోనాలీ జుట్టు కత్తిరించుకుని ఉన్నప్పుడు తీసిన ఫోటోను కూడా అనుపమ్‌ ఖేర్‌ షేర్‌ చేశారు. గతంలో వీరిద్దరు కలిసి ‘హమరా దిల్‌ ఆప్నే పాస్‌ హై’, ‘దిల్‌ హై దిల్‌ మైనే’,‘ధాయ్ అక్షర్ ప్రేమ్ కే’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం అనుపమ్‌ ఖేర్‌ వైద్య నేపధ్యంలో సాగే  డ్రామా ‘న్యూ ఆమస్టర్‌డ్యామ్‌’ చిత్రకరణ నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్నారు.

ప్రస్తుతం అనుపమ్‌ ఖేర్‌, బాలీవుడ్‌లో ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’  చిత్రంలో నటిస్తున్నారు. విజయ్‌ రత్నాకర్‌ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్‌ నిర్మిస్తున్నారు. సలీమ్‌-సలైమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్‌ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు