పేరు కోసం పోరు

15 Feb, 2018 00:58 IST|Sakshi
అనుపమ్‌ ఖేర్‌, అనిల్‌ కపూర్‌

బాలీవుడ్‌ స్పైస్‌

‘‘నా పేరును వాడుకుంటున్నావు.. రాయల్టీ కట్టు లేదా లీగల్‌ నోటీస్‌ కోసం సిద్ధంగా ఉండు’’ అని నటుడు–దర్శకుడు అనుపమ్‌ ఖేర్‌పై హెచ్చరిక జారీ చేశారు అనిల్‌ కపూర్‌. విషయం ఏంటంటే.. ‘‘బెల్లెవ్యూ’’ అనే ఓ కెనెడా పాపులర్‌ టీవీ సిరీస్‌లో ముఖ్య పాత్ర పోషించనున్నారు అనుపమ్‌ ఖేర్‌. ఆ సిరీస్‌లో అనుపమ్‌ క్యారెక్టర్‌ పేరు డా. అనిల్‌ కపూర్‌. ఆ క్యారెక్టర్‌కు తన పేరును వాడుకుంటున్నారు అనే కారణంతో ట్విట్టర్‌లో ఈ కామెంట్స్‌  చేశారు అనిల్‌. దాంతో అనిల్, అనుపమ్‌ మధ్య గొడవ మొదలైందనే వార్తలు స్టార్ట్‌ అయ్యాయి. ఈ విషయం పై అనుపమ్‌ ఖేర్‌ స్పందిస్తూ – ‘‘అనిల్‌కపూర్‌ సరదాగా జోక్‌ చేశాడు. ఈ విషయంపై అనవసరమైన చర్చ జరుగుతోంది.

అయినా అనవసరమైన విషయాల్ని ఫోకస్‌ చేయడం మనకు అలవాటే కదా. అనిల్‌ అన్నాడని కాదు కానీ, అతని పేరుతో నేను ఆ క్యారెక్టర్‌ను చేస్తే కొంచెం అయోమయంగా ఉండొచ్చు. అందుకని నా పాత్ర పేరును మార్చమని ప్రొడక్షన్‌ టీమ్‌ను కోరాను. ప్రాజెక్ట్‌ విషయానికి వస్తే ఈ సిరీస్‌లో పార్ట్‌ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంటర్నేషనల్‌ టెలివిజన్‌లోనే ‘బెల్లవ్యూ’ మోస్ట్‌ అవెయిటెడ్‌ సిరీస్‌. నటుడిగా నా పరిధుల్ని పెంచుకుని, వరల్డ్‌ క్లాస్‌ టాలెంట్‌తో పని చేసే అవకాశం కల్పించనుంది ఈ సిరీస్‌’’ అని పేర్కొన్నారు. డేవిడ్‌ స్కల్నర్‌ రాసిన ఈ టీవీ సిరీస్‌ను ఎరిక్‌ మాన్‌హైమర్‌ నిర్మిస్తున్నారు. ఒక హాస్పిటల్‌లో పన్నెండు మంది పేషంట్స్‌ లైఫ్‌ అండ్‌ డెత్‌ సిచ్యువేషన్స్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌ షూటింగ్‌లో అనుపమ్‌ ఖేర్‌ మార్చి నుంచి పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు