ఓటమి పాఠాలు

14 Oct, 2018 05:22 IST|Sakshi
అనుపమా పరమేశ్వరన్‌

గెలుపు కచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కానీ, ఓటమి మాత్రం కచ్చితంగా ఏదోటి నేర్చుకునే అవకాశాన్నిస్తుంది అంటున్నారు అనుపమా పరమేశ్వరన్‌. ఇండస్ట్రీలో గెలుపోటములంటే హిట్స్, ఫ్లాపులే. వీటిని అనుపమా ఎలా తీసుకుంటారో మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఫ్లాప్స్‌ అనేవి సహజం. ప్రతి సినిమా బాగా ఆడుతుంది అని కూడా అనుకోలేం. ఎవరైనా సరే విజయం సాధించాలనే కష్టపడతాం. ముఖ్యంగా ఆర్ట్‌ విషయంలో ఏ ఒక్కరూ సులువుగా తమ పని వల్ల సంతృప్తి చెందరు.

ఇంకా ఇంకా బెస్ట్‌ ఇవ్వాలనే తాపత్రయపడతారు. ఫెయిల్యూర్‌ వచ్చిందని ఎవర్నీ నిందించలేం. కానీ, మనం ఎక్కడ తప్పు చేశాం అనే విషయాలు మళ్లీ పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. దాని వల్ల ఇంకా జాగ్రత్తలు తీసుకొని మనల్ని మనం మెరుగుపరుచుకునే చాన్స్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఓటములే మంచి పాఠాలు’’ అని అనుపమా పేర్కొన్నారు. తాజాగా రామ్‌తో ఆమె నటించిన ‘హలో గురు ప్రేమకోసమే’(తెలుగు), శివరాజ్‌కుమార్‌తో నటించిన ‘నట సార్వభౌమ’ (కన్నడ) సినిమాలు త్వరలో విడుదలకానున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు