ఆ విషయాల్లో తలదూర్చడం అనాగరికం

21 Nov, 2019 08:39 IST|Sakshi

నటి అనుపమ పరమేశ్వర్‌కు కోపం వచ్చింది. మలయాళ చిత్రం ప్రేమమ్‌తో పరిచయం అయ్యి పాపులర్‌ అయిన హీరోయిన్లలో ఈ కేరళా కుట్టి ఒకరు. అందులో నటించిన సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్‌ల మాదిరిగానే ఈ అమ్మడు ఇతర భాషల్లో అవకాశాలను అందుకుంది. అలా కోలీవుడ్‌లో ధను‹Ùకు జంటగా కొడి చిత్రంలో నటించింది. ఆ తరువాత ఎందుకనో కోలీవుడ్‌ అనుపమ పరమేశ్వర్‌ను పట్టించుకోలేదు. అయితే తెలుగు సినిమా బాగానే అవకాశాలను అందించింది. అయితే ప్రస్తుతం అక్కడా దుకాణం లేపేయాల్సిన పరిస్థితి అంటున్నారు. దీంతో ఇటీవల అవకాశాల వేటలో పడింది. అందుకు గ్లామర్‌ను మార్గంగా ఎంచుకున్నట్లుంది. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను తెచ్చుకున్న అనుపమ పరమేశ్వర్‌ ఇప్పుడు అందాలను ఆరబోస్తూ ఫొటో షూట్‌ నిర్వహించి సామాజక మాధ్యమాల్లో  విడుదల చేసింది. 

మరి వ్రతం తప్పినా ఫలితం దక్కే అవకాశం ఉందా? అన్నది  పక్కన పెడితే ఈ అమ్మడి ప్రేమాయణం గోల గోలగా మారింది. ఆ మధ్య క్రికెటర్‌ బుమ్రాతో ప్రేమ కలాపాలు అంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఇప్పుడు ఓ బాలీవుడ్‌ హీరోతో చెటాపట్టాలేసుకొని తిరుగుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న అనుపమ ఇక ఉపేక్షించి లాభం లేదనుకుందో ఏమో! తన గురించి, తన ప్రేమ గురించి జరుగుతున్న ప్రచారంపై ఫైర్‌ అయింది. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం వ్యక్తిగతం అని, ఇందులో తల దూర్చడం అనాగరీకం అని మండిపడింది. తన జీవితం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు  తెలుసని, తన గురించి ఇతరులు బాధ పడాల్సిన అవసరం లేదని కాస్త గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చింది. ఆమె చెప్పిన దాంట్లో అర్థం ఉన్నా సెలబ్రెటీ కదా! ఇలాంటి ప్రచారాలను ఎదుర్కోక తప్పదు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా