అది అందరికీ జరిగేదే

9 Oct, 2018 11:58 IST|Sakshi

సినిమా: అది అందరికీ జరిగేదే అని తేలిగా తీసుకుంటోంది నటి అనుపమ పరమేశ్వరన్‌. మలయాళ చిత్రం ప్రేమమ్‌ ఫేమ్‌ బ్యూటీస్‌లో ఒకరైన ఈ అమ్మడు లక్కీగా తమిళంలో కొడి చిత్రంలో ధనుష్‌తో రొమాన్స్‌ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్రం కూడా హిట్‌ అనిపించుకోవడంతో అనుపమ ఇక్కడ పాగా వేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అందుకు రివర్స్‌లో ఈ బ్యూటీ టాలీవుడ్‌లో పాగా వేసింది. అక్కడ వరుసగా అవకాశాలు వరించాయి. ఇప్పుడు అక్కడ కూడా జోరు తగ్గింది. ఇటీవల ఒక తెలుగు చిత్రంలో నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఈ అమ్మడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారట. దీంతో ఇద్దరి మధ్య వివాదం జరిగిందట. ఇలాంటి అంశాల గురించి అనుపమ పరమేశ్వరన్‌ ఏం చెప్పిందో చూద్దాం.

నేను మలయాళీని కావడంతో తమిళ భాష నాకు బాగా తెలుసు. అయితే తెలుగు నేర్చుకోవడానికే చాలా కష్టపడ్డాను. ఇక నేను నటినైన కాలం నుంచి కన్నడంలో అవకాశాలు వస్తున్నాయి. అయితే తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల కన్నడ అవకాశాలను అంగీకరించలేకపోయాను. అలాంటిది ఇటీవల పునీత్‌ రాజ్‌కుమార్‌కు జంటగా నటించే అవకాశం వచ్చింది. కథ పాత్ర ఆకట్టుకోవడంతో ఆ చిత్రాన్ని వదులుకోలేకపోయాను. ఆ చిత్ర షూటింగ్‌లో పునీత్‌ రాజ్‌కుమార్‌తో సహా యూనిట్‌ అంతా నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇకపోతే ప్రకాశ్‌రాజ్‌తో గొడవ గురించి చాలా ప్రచారం జరుగుతోంది. నేను ఆయనతో కలిసి 6 నెలలు చిత్రానికి పని చేశాను. అప్పుడు జరిగిన చిన్న సంఘటనను పెద్దగా ప్రచారం చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌ నాకు చిన్న హితబోధ  చేసినదానికి ఏదో జరిగిపోయిందన్నంతగా రాద్దాంత్తం చేస్తున్నారు. నిజానికి ఆ సంఘటన జరిగిన తరువాత కూడా మేమిద్దం 25 రోజులు కలిసి పని చేశాం.

నాకు ఆశ ఎక్కువే
నాకు ఆశ కాస్త ఎక్కువే. చిత్రంలో ఎందరు హీరోయిన్లు ఉన్నారన్న విషయం గురించి పట్టించుకోను. నా పాత్రలో సత్తా ఉందా? అన్నదాని గురించే ఆలోచిస్తాను. అదే విధంగా నా దర్శకులు బలమైన పాత్రలను కల్పిస్తున్నారు. ఇంకా మంచి పాత్రల కోసం అత్యాశతోనే ఎదురు చూస్తున్నాను.

మరిన్ని వార్తలు