సీక్వెల్‌లో

24 Dec, 2019 00:05 IST|Sakshi
అనుపమా పమేశ్వరన్‌

నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో 2014లో వచ్చిన థ్రిల్లర్‌ చిత్రం ‘కార్తికేయ’. లేటెస్ట్‌గా ఈ సూపర్‌ హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ రెడీ కాబోతోంది. మొదటి భాగంలో స్వాతి, నిఖిల్‌ జంటగా నటించారు. తాజా సీక్వెల్‌లో అనుపమా పమేశ్వరన్‌ కూడా నటిస్తారని తెలిసింది. ‘కార్తికేయ 2’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూఛిబొట్ల నిర్మించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. మొదటి భాగంలో కనిపించిన స్వాతి ఈ సీక్వెల్‌లోనూ కనిపిస్తారట. అనుపమ పాత్ర కొత్త జాయిన్‌ అవుతుందని తెలిసింది. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, సీక్వెల్‌ అక్కడి నుంచి ప్రారంభం కానుంది. గతంలో చందు మొండేటి ‘ప్రేమమ్‌’లో అనుపమ ఓ హీరోయిన్‌గా నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా