క్రిష్‌ సినిమా: పవన్‌కు జోడిగా అనుష్క

5 May, 2020 13:09 IST|Sakshi

చిన్న గ్యాప్‌ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ జోరు పెంచారు. వేణు శ్రీరామ్‌ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘వకీల్‌ సాబ్‌’ విడుదలకు సిద్దంగా ఉంది. అయితే కరోనా లాక్‌డౌన్‌తో థియేటర్లకు తాళం పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వకీల్‌ సాబ్‌ విడుదలవడంతో పాటు క్రిష్‌ సినిమా పట్టాలెక్కేది. కానీ కరోనాతో అన్నీ తలకిందులయ్యాయి. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్‌ పనులకోసం సద్వినియోగం చేసుకుంటున్నారు దర్శకులు. ఈ క్రమంలో పవన్‌-క్రిష్‌ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రాబిన్‌ హుడ్‌ కాన్సెప్ట్‌తో హిస్టారికల్‌ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ బందిపోటు పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్‌ ‘విరూపాక్ష’గా ఫిక్సయిందని టాలీవుడ్‌ టాక్‌. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో స్పష్టతరావడం లేదు. తొలుత ఈ చిత్రంలో జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ అని అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రంలో స్వీటీ అనుష్క పవన్‌ సరసన నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్లకు అవకాశం ఉండటంతో జాక్వలిన్‌, అనుష్కల వైపు క్రిష్‌ మొగ్గు చూపుతున్నట్లు ఫిలింనగర్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. దీంతో ఈ సినిమా అప్‌డేట్‌ కోసం పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

చదవండి:
‘విజయ్‌ ఆగ్రహం.. మద్దతిచ్చిన టాలీవుడ్‌’
‘డియర్‌ విజయ్‌.. నేనర్థం చేసుకోగలను’

మరిన్ని వార్తలు