భాగమతి ప్రేమకథ

4 May, 2017 00:24 IST|Sakshi
భాగమతి ప్రేమకథ

లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అనుష్క అన్నట్లుగా అయిపోయింది. ‘అరుంధతి’లో జేజెమ్మ, ‘రుద్రమదేవి’లో రాణీ రుద్రమదేవి, ఇటీవల విడుదలైన ‘బాహుబలి’లో దేవసేన.. అన్నీ శక్తివంతమైన పాత్రలే. మరో రెండు నెలల్లో విడుదల కానున్న ‘భాగమతి’ చారిత్రక చిత్రం కాకపోయినా ఇందులో కూడా అనుష్కది పవర్‌ఫుల్‌ క్యారెక్టరే. ఇది ప్రేమకథా చిత్రం. ‘పిల్ల జమిందార్‌’ ఫేం ఆశోక్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తయింది.

ప్రస్తుతం డబ్బింగ్, వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరుగుతున్నాయి. ఇంతకీ ‘భాగమతి’లో అనుష్క గెటప్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలను కుంటున్నారా? జస్ట్‌ ముప్ఫై రోజులాగితే చాలు. వచ్చే నెల టీజర్‌ను, జూలైలో సినిమాని రిలీజ్‌ చేస్తారు. ప్రస్తుతం అనుష్క కొత్త సినిమాలేవీ కమిట్‌ కాలేదు. కథలు వింటున్నానని అన్నారు. ‘బాహుబలి’ మంచి అనుభూతినిచ్చిందని, ఇందులో మహేంద్ర బాహుబలి తల్లి పాత్ర చేయడం సవాల్‌ అనిపించిందని చెప్పారు. భవిష్యత్తులో తన పిల్లలకు ‘బాహుబలి’ కథ చెబుతానని అనుష్క అన్నారు.