21 రోజులే కలిసున్నాం: అనుష్క శర్మ

2 Jul, 2020 09:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘విరాట్‌ నేను పర్యటించిన ప్రతిసారి అది మా ట్రిప్‌ కాదు. కొన్నిసార్లు కలిసి భోజనం మాత్రమే చేసేవాళ్లం’ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ చెప్పారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అనుష్క మాట్లాడుతూ.. విరాట్‌, నేను కలిసి పర్యటించామంటే అవి సెలవు రోజులు అనుకుంటారంతా. కానీ అది నిజం కాదు. ఎందుకంటే విరాట్‌ ఎప్పుడు బిజీగా ఉంటాడు. కొన్నిసార్లు మా ట్రిప్‌ అంటే కలిసి భోజనం చేయడం మాత్రమే. నిజానికి మా వివాహమైన మొదటి 6 నెలల్లో విరాట్‌ నేను 21 రోజులే కలిసి ఉన్నాం. కొన్నిసార్లు కలిసి భోజనం చేసేందుకే విదేశాల్లో కలుసుకునే వాళ్లం’ అంటూ చెప్పుకొచ్చారు. (‘అనుష్కతో నేను మాట్లాడటం కోహ్లికి నచ్చలేదు’)

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  మాట్లాడుతూ.. ‘నేను అనుష్కను కలిసినప్పుడల్లా మా బంధం ఎప్పటిదో అనిపిస్తుంది. మేము ప్రతిరోజూ ఒకరినొకరు ప్రేమిస్తూ జీవిస్తాం. మా సంబంధం ఎల్లప్పుడూ ప్రేమతో మాత్రమే నిండి ఉంటుంది. ఇది కొన్నిరోజుల క్రితం కాదు యుగయుగాలుగా నుంచి ఉందన్న భావన కలుగుతుంది’’ అని చెప్పాడు. కోహ్లి, అనుష్కల వివాహం 2017 డిసెంబర్‌ 11న ఇటలీలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొద్దిమంది బాలీవుడ్‌, క్రికెట్‌ ప్రముఖుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. (ఆ దెయ్యం రక్తం తాగుతుంది తెలుసా!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా