తాప్సీకి పోటీగా.. కోహ్లి భార్య మైదానంలోకి!

14 Jan, 2020 10:23 IST|Sakshi

సినిమా రంగంలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందుకు అనుగుణంగానే తాజాగా బాలీవుడ్ బ్యూటీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ ఓ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. భార‌త మ‌హిళా క్రికెట‌ర్ ఝుల‌న్ గోస్వామి బ‌యోపిక్‌లో ప్రధానపాత్ర పోషించేందుకు అనుష్క అంగీకరించారు. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన టీమిండియా లెజెండ్ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి తన 18 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది.

ఝలన్ గోస్వామి 2010లో అర్జున అవార్డ్‌తో పాటు ప‌ద్మశ్రీ అవార్డు కూడా ద‌క్కించుకుంది. 2002లో తొలి వ‌న్డే మ్యాచ్ ఆడిన గోస్వామి ఇటీవ‌ల టీ20ల‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించింది. అటు భార‌త మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్ బ‌యోపిక్ కూడా రూపొందుతోంది. ఈ మూవీలో నటి తాప్సీ మిథాలీరాజ్ పాత్రను పోషిస్తోంది. శభాష్ మిథు పేరుతో సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇటు అనుష్క శర్మ కూడా ఝలన్ గోస్వామి బయోపిక్‌లో నటించనుండడంతో రెండు బయోపిక్ లు త్వరలో ప్రేక్షకులను అలరించనున్నాయి. క్రీడాకారుల జీవిత చరిత్రలతో రూపొందే బయోపిక్‌లకు మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: 2020 కోసం వెయింటింగ్‌: అనుష్క శర్మ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లేడీ అమితాబ్‌ ‘కిక్‌’ మాములుగా లేదుగా..

మా వియ్యపురాలు ఇకలేరు: అమితాబ్‌

టిక్‌టాక్‌ వీడియో.. అమితాబ్‌, హృతిక్‌ ఫిదా

వసూళ్ల వరద

దీపిక.. ముందు వాటి గురించి తెలుసుకో

సినిమా

లేడీ అమితాబ్‌ ‘కిక్‌’ మాములుగా లేదుగా..

మా వియ్యపురాలు ఇకలేరు: అమితాబ్‌

వసూళ్ల వరద

తాప్సీకి పోటీగా.. కోహ్లి భార్య మైదానంలోకి!

ఇన్‌స్ట్రాగామ్‌లో నటికి అసభ్య ఎస్‌ఎంఎస్‌లు

ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కిస్తా