మొదటి అడుగు

3 Apr, 2018 00:32 IST|Sakshi
అనుష్కా శెట్టి

ఇప్పటివరకూ తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో అలరించారు బెంగళూరు బ్యూటీ అనుష్కా శెట్టి. ఆ మాటకొస్తే మాతృభాష కన్నడ కంటే తెలుగులోనే అత్యధిక చిత్రాలు చేశారామె. ఈ ఏడాది మలయాళ చిత్రసీమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. అది కూడా మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి సరసన కథానాయికగా నటించనున్నారని సమాచారమ్‌. ‘అరుంధతి’ సినిమా తర్వాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్న అనుష్క అప్పుడప్పుడూ హీరోలతోనూ జోడీ కడుతున్నారు.  అనుష్క నటించిన ‘భాగమతి’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

ఆ సినిమా తర్వాత ఏ తెలుగు సినిమా కూడా అనుష్క చేతిలో లేదు.అయితే గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట అనుష్క. తాజాగా మలయాళం నుంచి ఆఫర్‌ రావడం, మమ్ముట్టి వంటి స్టార్‌ హీరోకి జోడీ కావడంతో ఓకే చెప్పారట అనుష్క. మమ్ముట్టి హీరోగా శరత్‌ సందిత్‌ దర్శకత్వంలో  తెరకెక్కిన ‘పెరోల్‌’ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలయ్యాక శరత్‌ దర్శకత్వంలోనే మమ్ముట్టి ఓ భారీ బడ్జెట్‌ సినిమా చేయనున్నారట. ఆ చిత్రంలోనే అనుష్క నటించనున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు