కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలు: అనుష్క

10 Jan, 2020 14:44 IST|Sakshi

అరుంధతి, బాహుబలి, భాగమతి వంటి సినిమాల్లో తన నటనతో అభిమానులను మెస్మరైజ్‌ చేశారు టాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శెట్టి. ఏ పాత్రలో అయినా స్వీటీ ఇట్టే ఒదిగిపోయి జీవించగలరు. అయితే అనుష్క స్క్రీన్‌పై కనిపించి ఏడాది దాటిపోయింది. 2018లో విడుదలైన భాగమతినే అభిమానులకు ఈ భామ చివరి దర్శనం. సంవత్సరం గ్యాప్‌ తర్వాత ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాలో నటిస్తున్నారు. హేమంత్‌ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించనున్నారు. మాధవన్‌, అంజలి, పాలినీ పాండే, హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడ్సన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఓ వైపు చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా మరోవైపు మూవీకి సంబంధించి పోస్టర్లు, టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేస్తుంది.

తాజాగా అనుష్క తన రాబోయే సినిమా నిశ్శబ్దంకు సంబంధించిన పనులను చూసుకోడానికి బుధవారం ఓ ప్రైవేటు స్టూడియోను సందర్శించారు. తన వ్యక్తిగత జీవితాన్ని అందరితో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడని అనుష్క.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. నిశ్శబ్దం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు ఏంటి అని ఓ విలేఖరి  అడగ్గా.. ఇంకా సమయం ఉంది. వచ్చే వారం నుంచి ప్రారంభిస్తాను అని బదులిచ్చారు. అలాగే రాబోయే సంక్రాంతిని ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారని అడగ్గా.. కుటుంబంతో కలిసి సంక్రాంతి జరుపుకోడానికి సొంతూరు బెంగళూరుకు వెళ్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా నిశ్శబ్దం  సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకోవడంతో ఈ నెల చివరన లేదా వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయడానికి చిత్ర మూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్ల తెలుస్తోంది. తెలుగుతోపాటు కన్నడం, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా