అది నేను కోరుకున్నదే!

18 Jul, 2018 08:43 IST|Sakshi

తమిళసినిమా: అది నేను కోరుకున్నదే అంటోంది అందాల భామ అనుష్క. తెలుగు, తమిళ భాషల్లో అగ్రనటిగా రాణిస్తున్న కథానాయకి ఈ జేజెమ్మ. బాహుబలి–2లో అందంతో పాటు, రాజసాన్ని, పౌరుషాన్ని ప్రదర్శించి వావ్‌ అనిపించుకున్న అనుష్క భాగమతి చిత్రంలో శక్తి యుక్తులతో పాత్రను రక్తిగట్టించి ఈ చిత్రాన్ని విజయతీరం దాటించింది. అలాంటి మంచి నటి ఇప్పుడు ఒక్క చిత్రం కూడా చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అం శం. దీంతో అనుష్క గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నాయి. ఈ స్వీటీని ఓ ఇంటిదాన్ని చేయడానికి ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్నది మినహా ఆ వదంతుల్లో నమ్మదగ్గవి ఏమీలేవు. అనుష్క పెళ్లి కోసం దోష నివారణ పూజలను నిర్వహించారు. అయినా ఇంకా సరైన వరుడు లభించలేదు. అనుష్కకు 36 ఏళ్లు. అయినా ఆమె అందంలో ఏ మాత్రం మార్పు లేదు. అంతగా అందాన్ని ఎలా కాపాడుకుంటున్నారన్న ప్రశ్నకు ఈ బ్యూటీ ఏం చెప్పిందో చూద్దాం.

శరీరానికి, మనసుకు మధ్య సమతుల్యం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. అందం అనేది మనసులోంచి రావాలి. అంతేగానీ దాన్ని బయట నుంచి పొందలేం. ఈ రహస్యాన్ని తెలుసుకోవడం వల్లే నన్ను నేను అందంగా ఉంచుకోగలుగుతున్నాను. పెరిగే వయసును ఆపడం సాధ్యం కాదు. అయితే వయసైపోతోందని చింతించకూడదు. వయసు అన్నది లెక్కపెట్టుకోవడం కోసమే. దాన్ని సంతోషంగా మార్చుకుంటే వయసు పైబడిపోతోందన్న భావన మనకు రాదు. విరామం లభించినప్పుడు మరో పనిచేయకుండా విశ్రాంతి తీసుకుంటాను. ఆ సమయంలో ఏకాంతాన్ని కోరుకుంటాను. నా గురించి ఆలోచించుకుంటాను. నాకు తెలియకుండా ఏదైనా తప్పుచేస్తే అది గుర్తుకొస్తుంది. ఆ తప్పును మళ్లీ చేయకుండా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ప్రస్తుతం చిత్రాల్లో నటించకుండా ఉండడం నేను కోరుకుని తీసుకున్న నిర్ణయమే. శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం అవడంతో కొత్త చిత్రాలేవీ అంగీకరించడం లేదు. ఈ విశ్రాంతిని సంతోషంగా అనుభవిస్తున్నాను అని పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌

వెబ్‌ ఇంట్లోకి...

చలో లాస్‌ ఏంజిల్స్‌

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..