చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..

6 Mar, 2020 15:40 IST|Sakshi

భాగమతి తర్వాత చాలా రోజులు గ్యాప్‌ తీసుకుని హీరోయిన్‌ అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్‌, అంజలి, షాలిని పాండే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ప్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం హీరో నాని విడుదల చేశారు. చిత్రబృందానికి బెస్ట్‌ విషేస్‌ తెలియజేశారు. ఈ చిత్రంలో అనుష్క మూగ చిత్రకారిణి పాత్రలో కనిపించనున్నారు. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో చీకట్లో జరిగే దాడులపై విచారణ చేపట్టే అధికారిణిగా అంజలి కనిపించనున్నారు. (చదవండి : శింబుతో సెట్‌ అవుతుందా?)

చిత్రం పేరు నిశ్శబ్దం అయినప్పటికీ.. ప్రేక్షకులను మాత్రం థ్రిల్‌కు గురిచేస్తుందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ‘నిన్న నీ బెస్ట్ ఫ్రెండ్ సోనాలి ఎందుకు రాలేదు?’, ‘ఒక ఘోస్ట్ ఇదంతా చేసిందని యాక్సెప్ట్ చెయ్యడానికి నా సెన్సిబిలిటీస్ ఒప్పుకోలేదు’, ‘ఇదంతా ఓ పాతికేళ్ళ అమ్మాయి ఒక్కత్తే చేసిందంటారా?’ అనే డైలాగ్‌లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. కాగా, టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంకట్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఏప్రిల్‌ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుదల కానుండి. గోపి సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించగా, కోన వెంకట్‌ డైలాగ్‌​ రైటర్‌గా ఉన్నారు. (చదవండి : అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా