నేను బాగానే ఉన్నా: అనుష్క

27 Jun, 2019 14:39 IST|Sakshi

‘భాగమతి’గా వెండితెరపై అనుష్క కనిపించి ఏడాది దాటిపోయింది. మరో చిత్రం ఒప్పుకోవడానికి చాలా టైమ్‌ తీసుకున్న స్వీటీ మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సైరా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అనుష్కకు సంబంధించిన సన్నివేశాలను షూట్‌ చేస్తున్న సమయంలో ఆమెకు గాయాలయ్యాయని వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

సైరా షూటింగ్‌కు సంబంధించిన షూటింగ్‌ పూర్తైయిందని కెమెరామెన్‌ రత్నవేలు సోషల్‌ మీడియా వేదికగా తెలపడం.. అనుష్క సైతం ప్రస్తుతం సైలెన్స్‌ అనే బహుభాషా చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉందని ప్రకటించడంలో సైరా షూటింగ్‌లో గాయపడిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. ఈ వార్తలపై అనుష్క సోషల్‌మీడియాలో స్పందిస్తూ.. ‘నేను ఆరోగ్యంగా ఉన్నాను. సియాటెల్‌లో షూటింగ్‌ చేస్తు సంతోషంగా ఉన్నాను. లవ్‌యూ ఆల్‌’ అంటూ పోస్ట్‌ చేసింది.  హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కిస్తున్న సైలెన్స్‌ చిత్రంలో మాధవన్‌ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

😘😘

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా