సిక్స్‌ప్యాక్ హీరోయిన్!

31 Jul, 2013 01:08 IST|Sakshi
సిక్స్‌ప్యాక్ హీరోయిన్!
కాలం మారుతోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన స్త్రీ నేడు అన్ని రంగాల్లో రాణిస్తోంది. సినీ రంగానికొస్తే హీరోల కొత్త అవతారం సిక్స్‌ప్యాక్. బాలీవుడ్ హీరోలు షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్ లాంటివారు ఈ సిక్స్‌ప్యాక్ బాడీకి మారారు. అదిప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌కు పాకింది. సూర్య, విశాల్, భరత్ తదితర హీరోలు సిక్స్‌ప్యాక్ బాడీతో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించారు. 
 
 అయితే తామేం తక్కువ కాదంటోంది అనుష్క. అరుంధతి చిత్రంలో తనలోని నట విశ్వరూపాన్ని చూపింది. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో రాణి రుద్రమదేవి, బాహుబలి వంటి చారిత్రక కథా చిత్రాలలో వీరనారిగా నటిస్తోంది. వీటి తర్వాత మరో వైవిధ్యభరిత చిత్రాన్ని చేయనుందట. 
 
 ఈ చిత్రం కోసం ఆమె సిక్స్‌ప్యాక్ బాడీకి మారనుందట. ఇందుకోసం ఆమె సిక్స్‌ప్యాక్ ట్రైనర్ కిరణ్, డెమ్లాను ఆశ్రయించిందట. ఈయన పలువురు హీరోలకు సిక్స్‌ప్యాక్ బాడీకి శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు అనుష్కను సిక్స్‌ప్యాక్ హీరోయిన్‌గా తయారు చేయనున్నారన్నమాట.