స్లిమ్‌గా స్వీటీ!

3 Sep, 2017 10:15 IST|Sakshi
స్లిమ్‌గా స్వీటీ!

తమిళసినిమా: చేతిలో సొమ్ముంటే కొండపైన కోతి కూడా దిగివస్తుందనే నానుడి ఉంది. అలాంటిది నటి అనుష్కలాంటి టాప్‌ కథానాయికకు జిమ్‌ ఒక లెక్కా. ఏమిటీ అసందర్భ మాటలంటారా? నటనలో వైవిధ్యం కోసం తారలు ఆయా పాత్రలకు జీవం పోయడానికి సాధ్యమైనంత వరకూ కృషి చేస్తుంటారు. హీరోలైతే బరువు తగ్గడానికి, పెరగడానికి, సిక్స్‌ ప్యాక్‌ బాడీకి తయారవ్వడానికి శ్రమిస్తారు. హీరోయిన్లు మాత్రం అంతలా సాహసం చేయలేరు.

ముఖ్యంగా బరువు పెరగడానికి సమ్మతించరు. ఎందుకంటే అందం వారికి చాలా ముఖ్యం. అలాంటిది నటి అనుష్క ఇంజిఇడప్పళగి(సైజ్ జీరో) చిత్రం కోసం మ్యాగ్జిమమ్‌ బరువు పెరిగి నటించారు. ఆ తరువాత తను బరువు తగ్గడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. అనుష్క బరువు బాహుబలి 2 చిత్రానికి కూడా చాలా భారమైంది. ఆ చిత్రం తరువాత వచ్చిన కొన్ని అవకాశాలను అనుష్క తిరష్కరించిందట. కారణం తాను మళ్లీ మునుపటి అనుష్కలా అందంగా తయారైన తరువాత కొత్త చిత్రాలను అంగీకరిస్తానని చెప్పి బరువు తగ్గడానికి శారీరక కసరత్తులు చేయడం మొదలెట్టారు.

అందుకు ఇంట్లోనే అధునాతనమైన జిమ్‌తో పాటు, ఒక శిక్షకుడిని నియమించుకున్నారు. రోజుకు 8 గంటల పాటు జిమ్‌లోనే గడుపుతూ శారీరక శ్రమతో పూర్వ అందాలతో చాలా స్లిమ్‌గా తయారయ్యారట. అంతకు ముందు తనతో చిత్రాలు చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతల్లో ఒకరిని ఇటీవల ఇంటికి రప్పించుకుని కథ చెప్పమని, ఆ కథ నచ్చడంతో నటించడానికి పచ్చజెండా ఊపారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల టాక్‌. సో చిన్న విరామం తరువాత అనుష్క విజృంబణను చూడవచ్చునన్నమాట. అనుష్క ప్రస్తుతం నటిస్తున్న టాలీవుడ్‌ చిత్రం భాగమతి నిర్మాణాంతక కార్యక్రమాల్లో బిజీగా ఉందని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా