గుర్తుపట్టలేనంతగా మారిన అనుష్క..

28 Mar, 2018 16:13 IST|Sakshi

బాలీవుడ్‌ : వరుణ్‌ ధావన్‌‌, అనుష్క శర్మ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సుయి ధాగా’. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో ఆమె అభిమానులే కాక కోహ్లి అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్తగా కనిపిస్తున్న అనుష్క ఫొటోలను చూసిన అభిమానులు ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా నటిస్తుందేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  బ్లూ సారీ, రెడ్‌ బ్యాంగిల్స్‌ ధరించిన అనుష్క పూర్తిగా ఢిపరెంట్‌ లుక్‌లో ఉండటంతో అభిమానులు ఆమెని సరిగా పోల్చుకోలేకపోతున్నారు.

ఇటీవలే విడుదలైన పరీలో అద్భుత నటనతో ఆకట్టుకున్న అనుష్క ప్రస్తుతం సుయి ధాగాలో డీ గ్లామర్‌ పాత్రలో నటిస్తున్నారు. వరుణ్‌ కూడా ఈ చిత్రంలో ఢిపరెంట్‌ లుక్‌లో కనిపించబోతున్నారు. యశ్‌ రాజ్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మమతా, మౌజీ పాత్రల్లో  అనుష్క, వరుణ్‌  కనిపించనున్నారు. మేడ్‌ ఇన్‌ ఇండియా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ  చిత్రం కోసం వరుణ్‌ కుట్టుమిషన్‌, అనుష్క ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు