క్రిమితో సమరం

5 Jun, 2020 00:12 IST|Sakshi
నిఖిల్, విజయసాయి రెడ్డి, అమర్‌నాథ్, యు. చరణ్‌తేజ్‌

స్టాప్‌ కరోనా

కరోనా ప్రభావం రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ విపత్కర వ్యాధి ప్రబలకుండా యావత్‌ దేశాలు శక్తి మేర కృషి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల చాలామంది వివిధ రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పట్లో కరోనాకి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

కరోనా బారిన పడకుండా మనందరం జాగ్రత్తగా ఉంటూ, లాక్‌డౌన్‌ సమయంలో ఎలా అయితే మనం పోలీసులకు, వైద్య సిబ్బందికి సహకరించామో అదే రీతిన ఇకపై కొనసాగాలని, కరోనా వల్ల దెబ్బతిన్న మన జీవితాలను మళ్లీ మనమే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని అర్థం వచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి యంగ్‌ హీరో నిఖిల్‌తో కలిసి ఓ పాటను సిద్ధం చేయించారు.

మనం అంతా కలిసి కరోనాని అడ్డుకోవాలి అని చాటి చెప్పే రీతిన ఉన్న ఈ పాటను విజయ సాయిరెడ్డి విడుదల చేశారు. ఈ పాటకు దర్శకుడు చందు మొండేటి కాన్సెప్ట్‌ని రెడీ చేశారు. పాటలో ‘కనిపించని క్రిమితో సమరం’ అని ఉన్న ఈ పాటకు  సంగీత దర్శకులు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. అలానే ఈ పాటలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కనిపించారు. వారిలో కాజల్‌ అగర్వాల్, నిధీ అగర్వాల్, ప్రణీతా సుభాష్, సుధీర్‌బాబు, పీవీ సింధు తదితరులు ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు